E-Paper
Advertisement

Election Commission Of India : 5 రాష్ట్రాల ఎన్నికలు.. భారీగా పట్టుబడిన నగదు.. ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?

Election Commission Of India : 5 రాష్ట్రాల ఎన్నికలు.. భారీగా పట్టుబడిన నగదు.. ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
Advertisement

Election Commission Of India : దేశవ్యాప్తంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఇప్పటి వరకు రూ.1760 కోట్లు సీజ్‌ చేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

5 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ.1760 కోట్లు సీజ్‌ చేసినట్లు ఈసీ ప్రకటించింది. గత ఎన్నికలతో పోల్చితే 7 రెట్లు ఎక్కువ నగదు సీజ్‌ చేసినట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న 5 రాష్ట్రాల్లో.. తెలంగాణలోనే ఎక్కువ సీజ్‌ చేశామని ఈసీ ప్రకటించింది.

Advertisement

ఇప్పటి వరకు తెలంగాణలో సీజ్‌ చేసిన సొత్తు వివరాలను ఈసీ వెల్లడించింది. నగదు రూ.225.23 కోట్లు సీజ్ చేశామని తెలిపింది. రూ.86.82 కోట్ల విలువైన మద్యం పట్టుబడిందని పేర్కొంది. రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని ప్రకటించింది. రూ.191.02 కోట్ల విలువైన లోహాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులు పట్టుబడ్డాయని వివరించింది. మొత్తంగా తెలంగాణలో సీజ్‌ చేసిన సొత్తు విలువను రూ.659.2 కోట్లు ఉంటుందని ఈసీ స్పష్టం చేశారు.

Tags

Related News

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

Big Stories

Advertisement
×