E-Paper
Advertisement

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

లెక్కలు బయట పెట్టండి..  మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ
Advertisement

Delhi: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై ప్రధాని మోదీకి లేఖ సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే.

రామమందిరం విరాళాల దుర్వినియోగం అంశం-పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. సభలో బిల్లులు పెట్టే అంశం కాసేపు పక్కన పెడదాం. మోదీ సర్కార్‌ని ఇరుకున పెట్టేందుకు కీలక అస్త్రాలు సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. యూపీలో తీవ్ర దుమారం రేపుతోన్న రామమందిరం విరాళాల అంశపై లేవనెత్తాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే లేఖ రాశారు.

Advertisement

ప్రధానికి లేఖ రాసిన ఖర్గే-రాహల్-పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. సభలో బిల్లులు పెట్టే అంశం కాసేపు పక్కన పెడదాం. మోదీ సర్కార్‌ని ఇరుకున పెట్టేందుకు కీలక అస్త్రాలు సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. యూపీలో తీవ్ర దుమారం రేపుతోన్నరామమందిరం విరాళాల అంశపై లేవనెత్తాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే సంయుక్తంగా  లేఖ రాశారు.

స్వతంత్ర దర్యాప్తు చేపట్టలని డిమాండ్-ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని అందులో కోరారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో వేల కోట్ల విరాళాల గోల్ మాల్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకల వినియోగంపై పూర్తి వివరాలు వెల్లడించాలని అందులో పేర్కొన్నారు. భక్తులు విశ్వాసంతో సమర్పించిన కానుకలపై ఇలాంటి ఆరోపణలు దారుణమన్నారు.

Advertisement

భక్తుల విరాళాల వివరాలు బయటపెట్టాలని డిమాండ్-ఈ ఘటన వల్ల కోట్లాది మంది భక్తులు తాము మోసపోయామన్న భావనలో ఉన్నారని తెలిపారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్ట్‌ ఏర్పాటుపై  ప్రధానమంత్రి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రస్ట్‌ సభ్యుల నియామకాలు కేంద్రం ఆధ్వర్యంలో జరిగాయన్నారు. ట్రస్ట్‌లోని పలువురికి ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ సంఘాలతో సంబంధాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి ప్రధానమంత్రికి సన్నిహితుడని ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ  మౌనం సరికాదన్నారు. ట్రస్ట్‌ ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుటివరకు వచ్చిన నగదు, బంగారం, వెండి సహా సమర్పించిన అన్ని కానుకల లెక్కలు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ALSO READ: విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

విరాళాల లెక్కల్లో అక్రమాలు సుమారు రూ.7 కోట్ల విలువైన నగదు, నగలు దారి మళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో పలువుర్ని అరెస్టు చేశారు. ట్రస్ట్‌ ఖాతాల పరిశీలన, నగదు లెక్కింపు, వంటి అంశాలను సెట్ పరిశీలిస్తోంది. ఈ కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కోరిన విషయం తెల్సిందే.

 

 

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×