E-Paper
Advertisement

మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు, అసలేం జరిగింది?

మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు,  అసలేం జరిగింది?
Advertisement

Hyderabad: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క‌సుమన్‌కు న్యాయస్థానం రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. ఆ తర్వాత నాంపల్లి పోలీసులు ఆయన్ని చంచల్‌గూడ జైలుకి తరలించారు. సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

Advertisement

సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ను పోలీసు అరెస్టు చేయడం, ఆపై న్యాయమూర్తి ముందు హాజరు పరచడం చకచకా జరిగిపోయింది. అరెస్టు సమయంలో భారీ హైడ్రామా చోటు చేసుకుంది. సింగరేణి సంస్థకు సంబంధించి బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ నేపథ్యంలో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. అరెస్టు సమయంలో తెలంగాణ భవన్‌ లోపల పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు బీఆర్‌ఎస్ కార్యకర్తలు-లాయర్లు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు ప్రశ్నించారు. ఆ సెక్షన్లు నాన్‌బెయిలబుల్ కేసులకు సంబంధించినవి కావడంతో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు పోలీసులు.

Advertisement

చంచల్‌గూడ జైలుకు తరలించిన నాంపల్లి పోలీసులు

ఈ ఉద్రిక్తత నడుమ ఆయన్ని రాత్రి నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలేంటి? సింగరేణిని తగులబెట్టండి, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.. డబ్బులు కావాలంటే ఆఫీస్‌లను తగలబెట్టాలంటూ కార్మికులకు పిలుపునిచ్చారు ఆయన. బాల్కసుమన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. బాల్క సుమన్ పై సెక్షన్స్ 326(g), 351(3), 353(1)(b), r/w 55, r/w 61(2)(a) BNS,4 PDPPA యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన తర్వాత నాంపల్లి పోలీసులు కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

ALSO READ: యూత్ డిక్లరేషన్ పై రాహుల్ గాంధీని నిలదీయండి.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ తర్వాత బాల్కసుమన్‌ను హిమాయత్ నగర్‌లోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులపై న్యాయమూర్తి కాసింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎఫ్ఐఆర్ కాపీ మరిచిపోయి రావడం, అపార్ట్మెంట్‌లోని న్యాయమూర్తి ఫ్లాట్ కు నిందితుడు బాల్క సుమన్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేసిన పోలీసులపై రుసరుసలాడారు. అపార్ట్మెంట్ కింద ఉండాలని జడ్జి సూచించడంతో బాల్క సుమన్ తరఫు లాయర్లు అక్కడే ఉండిపోయారు.  పోలీసు ఎస్కార్ట్ మధ్య చంచల్‌గూడ జైలుకు బాల్క సుమన్ ను తరలించారు పోలీసులు.

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×