E-Paper
Advertisement

IPL 2026 Finals: ఇవాళ్టి ఫైన‌ల్స్ లో అన‌న్య బిర్లా స‌పోర్ట్ ఎవ‌రికి..ఆ జెర్సీలో రానున్నారా ?

IPL 2026 Finals: ఇవాళ్టి ఫైన‌ల్స్ లో అన‌న్య బిర్లా స‌పోర్ట్ ఎవ‌రికి..ఆ జెర్సీలో రానున్నారా ?
Advertisement

IPL 2026 Finals:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య ఫైనల్స్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు జట్టును ఇటీవల కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ వారసురాలు అనన్య బిర్లా (Ananya Birla) ఏ జట్టుకు సపోర్ట్ చేస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈ మేరకు ఆమె రెండు జట్లకు సంబంధించిన జెర్సీలను ధరించిన ఫోటోలను వైరల్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

అనన్య బిర్లా ఏ జట్టుకు సపోర్ట్ చేయనుందంటే ?

Advertisement

2026 ఐపిఎల్ ప్రారంభం కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సొంతం చేసుకుంది ఆదిత్య బిర్లా గ్రూప్. మొత్తం నాలుగు కంపెనీలు బెంగళూరు జట్టును కొనుగోలు చేసినప్పటికీ… మెజారిటీ షేర్స్ మాత్రం ఆదిత్య బిర్లా గ్రూప్ కొనేసింది. ఏకంగా రూ.16, 706 కోట్లకు ఈ జట్టును కొనుగోలు చేసింది ఆదిత్య బిర్లా గ్రూప్. ఈ క్రమంలో ఈ జట్టుకు ఆర్యమన్ బిర్లా చైర్మన్గా ఉన్నప్పటికీ, మిగతా అన్ని బాధ్యతలు అనన్య బిర్లా చూసుకుంటున్నారు. బెంగళూరు ఆడే ప్రతి మ్యాచ్ కు వెళ్తున్నారు. ఇక అదే సమయంలో ఈసారి గుజరాత్ టైటాన్స్ జెర్సీ స్పాన్సర్ గా ఆదిత్య బిర్లా గ్రూప్ బరిలోకి దిగింది. డ్రీమ్ ఎలెవన్ పైన బ్యాన్ విధించిన నేపథ్యంలో, వాళ్ల స్థానంలో ఆదిత్య బిర్లా గ్రూప్ నకు సంబంధించిన బిర్లా ఎస్టేట్స్ కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.

ఇక ఈ జెర్సీ లాంచ్ సమయంలో కూడా గిల్ తో పాటు వేదికను పంచుకుంది అనన్య బిర్లా. అంటే ఇప్పుడు అనన్య బిర్లాకు రెండు జట్లు రెండు కళ్ళలాంటివి. అలాంటి రెండు జట్లు ఫైనల్స్ లో ఇవాళ తలపడుతున్నాయి. దీంతో ఆమె ఏ జెర్సీలో వస్తుంది? ఎవరికి సపోర్ట్ చేస్తారు? అని చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఒక క్రీడా విశ్లేషకుల సమాచారం ప్రకారం… బెంగుళూరు జట్టు గెలిస్తే ఆమె ఫుల్ హ్యాపీగా ఉంటారని అంటున్నారు. ఎందుకంటే బెంగుళూరు జట్టును కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆదిత్య బిర్లా గ్రూప్. కాబట్టి వాళ్లకి ఎక్కువ లాభాలు వస్తాయి. అందుకే బెంగళూరు జట్టుకు ఆమె సపోర్ట్ చేయనుందని అంటున్నారు. ఒకవేళ బెంగళూరు ఓడిపోయి గుజరాత్ గెలిచినా, ఆదిత్య బిర్లా గ్రూప్ నకు పెద్దగా నష్టం జరిగే ఛాన్స్ లేదని అంటున్నారు.

RCB VS GT మధ్య మ్యాచ్ ముందే ఊహించిన అనన్య

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి కంటే ముందు అనన్య బిర్లా… ఫైనల్స్ పై అంచనా వేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ జరుగుతుందని వెల్లడించింది. ఆమె చెప్పినట్లుగానే, ఇప్పుడు ఫైనల్ జరుగుతోంది.

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×