E-Paper
Advertisement

యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!

యూత్ డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీని నిలదీయండి.. ముషీరాబాద్ వేదికగా కేటీఆర్ సంచలన పిలుపు!
Advertisement

KTR: బ్యూరో స్వేచ్ఛ: యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రాహుల్ గాంధీని నిలదీయాలని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీని తీసుకువచ్చి అడ్డగోలు హామీలిచ్చి ఆ తరువాత అందరినీ దగా చేశారన్నారు. రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ల పేరుతో ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి, విద్యావంతులైన యువకులతో కూడా ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా కనీసం మొహం కూడా చూపించ లేదని విమర్శించారు.

కార్యకర్తల సమవేశంలో కేటీఆర్ ప్రసంగం

Advertisement

తెలంగాణ యువతకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే వచ్చి అండగా నిలబడతానని మాయమాటలు చెప్పిన వారిని నట్టేట ముంచారన్నారు. తెలంగాణ యువత రాహుల్ గాంధీని ఈ అంశంలో నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందే లేదన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు ముషీరాబాద్ లో జరిగిన పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

ఓటర్ల నమోదు అవకతవకలపై..

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్​ చెప్పారు. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన అవకతవకల పైన జాగ్రత్త వహించాలన్నారు. పార్టీ తరఫున ఎంపిక చేసిన బీఎల్ఏలు నిజమైన ఓటరు ఓటు తొలగకుండా కాపాడేలా ప్రయత్నం చేయాలన్నారు. దీనితో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అడ్డగోలుగా డబుల్ ఓట్లను, దొంగ ఓట్లను రాయించే ప్రమాదం ఉందని, దానిపై కన్నేసి పెట్టాలన్నారు.

హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ వెంట

బీఆర్​ఎస్​ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా హైదరాబాద్‌లో అద్భుతమైన విజయం సాధించిందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ వెంట నిలిచారన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారత రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరానికి చేసిన అభివృద్ధి వల్లే ఇది సాధ్యమైందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్ నగరానికి రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఫ్లైఓవర్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రోడ్లు వంటి నిర్మాణాలు చేస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ‘హైడ్రా’ పేరిట వేల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి గత ప్రభుత్వం నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని విమర్శించారు. వచ్చే నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని తెలిపిన కేటీఆర్, పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలో జరిగే ఈ సభ్యత్వానికి సంబంధించి పార్టీ శ్రేణులకు బూత్ వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల పైన, అన్యాయాల పైన కూడా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.

Also Read: మీనాక్షి నటరాజన్‌తో జగ్గారెడ్డి భేటీ.. అసలు నిజాలు ఇవే!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×