E-Paper
Advertisement

Begumpet SKAT Air Show: హైదరాబాద్ ఆకాశంలో అబ్బురపరిచే విన్యాసాలు.. డేట్ సేవ్ చేసుకోండి

Begumpet SKAT Air Show: హైదరాబాద్ ఆకాశంలో అబ్బురపరిచే విన్యాసాలు.. డేట్ సేవ్ చేసుకోండి
Advertisement

Begumpet SKAT Air Show: హైదరాబాద్ అద్భుతమైన వైమానిక విన్యాసాలకు సిద్ధమైంది. వింగ్స్ ఇండియా 2026లో భాగంగా జనవరి 28, 29 తేదీల్లో బేగంపేట విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ (SKAT) వైమానిక విన్యాసాలు ప్రదర్శించనుంది. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.

అబ్బురపరిచే విన్యాసాలు

ఇప్పటికే సూర్యకిరణ్ టీమ్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వరుసగా రెండు రోజులు జరిగే ఈ విన్యాసాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. వింగ్స్ ఇండియా హైదరాబాద్ లో.. హై-ప్రొఫైల్ వైమానిక ప్రదర్శనలను ఏటా నిర్వహిస్తుంటుంది.

Advertisement

1966లో ఏర్పడిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాయబారులుగా ప్రసిద్ధి చెందింది. బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ చెందిన ఈ టీమ్ BAE హాక్ Mk.132 విమానాలను నడుపుతుంది. ఈ యూనిట్‌లో 13 మంది పైలట్లు ఉన్నారు. 9 మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. దశాబ్దాలుగా.. ఈ టీమ్ ఏరోబాటిక్ విన్యాసాలు చేస్తూ ప్రశంసలు అందుకుంది.

బేగంపేట ఎయిర్ పోర్టులో ఎయిర్ షో

వింగ్స్ ఇండియా బేగంపేట ఎయిర్ పోర్టులో నిర్వహించే ఈ ఎయిర్ షో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్ గా పరిగణిస్తారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ ఎయిర్ షోను 2008లో ప్రారంభించారు. వింగ్స్ ఇండియా 2024లో.. భారత వైమానిక దళానికి చెందిన సారంగ్ హెలికాప్టర్ టీమ్ ఈ ప్రదర్శనలో అద్భుతమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వింగ్స్ ఇండియా 2026 ఎడిషన్ ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహిస్తారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో ముస్తాబవుతున్న చెరువులు.. సంక్రాంతికి అంతా సిద్దం!

మే 2025లో జరిగిన కర్టెన్ రైజర్ ఈవెంట్ లో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు వింగ్స్ ఇండియా 2026 థీమ్‌ను ఆవిష్కరించారు. “భారత విమానయానం: డిజైన్ నుండి విస్తరణ వరకు, తయారీ నుండి నిర్వహణ వరకు, ఆవిష్కరణకు, భద్రత నుండి స్థిరత్వం వరకు భవిష్యత్తును సుగమం చేయడం” అని ప్రకటించారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×