E-Paper
Advertisement

The Night Manager season 2 OTT : అనుకున్న దానికంటే ముందుగానే ‘ది నైట్ మేనేజర్ 2’స్ట్రీమింగ్… కానీ చిన్న ట్విస్ట్

The Night Manager season 2 OTT : అనుకున్న దానికంటే ముందుగానే ‘ది నైట్ మేనేజర్ 2’స్ట్రీమింగ్… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

The Night Manager season 2 OTT : దాదాపు 9 ఏళ్లు వేచి ఉన్న తర్వాత ‘ది నైట్ మేనేజర్ సీజన్ 2’ ఫైనల్‌గా వచ్చేసింది. అయితే ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కి ఇంకా టైమ్ ఉంది. కానీ అంతకంటే ముందే స్ట్రీమింగ్ అయ్యి షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? ఇండియాలో ఎప్పుడు చూడవచ్చు ? అనే వివరాలకు తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

దాదాపు దశాబ్దం తరువాత ‘ది నైట్ మేనేజర్ సీజన్ 2’ (The Night Manager season 2) స్ట్రీమింగ్ కావడంతో ఈ సిరీస్ అభిమానులు క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ ను చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇక ఇందులో టామ్ హిడిల్‌ స్టన్ (జోనాథన్ పైన్ పాత్రలో) మళ్లీ స్పై ఏజెంట్‌ గా తిరిగి వచ్చాడు. డియెగో కాల్వా (విలన్‌గా), కామిలా మోరోన్ కూడా కీ రోల్స్‌ లో కన్పించారు. అయితే నిజానికి ఈ సిరీస్ ఓటీటీలో రావడానికి ఇంకా టైమ్ ఉంది. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు.

Advertisement

బ్రిటన్‌ లో టీవీలో ముందుగా ప్రసారం చేశారు. దీంతో ఈ సీజన్ ఇప్పుడు ఇంటర్నెట్‌ లో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఉన్న ఇంటెన్స్ థ్రిల్, టామ్-డియెగో కెమిస్ట్రీ గురించి చెప్పుకుంటూ నెటిజన్లు ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. బ్రిటిష్ ప్రీమియర్ తర్వాత ఆడియన్స్ రియాక్షన్స్ చూసి, ఇండియన్ మూవీ లవర్స్ లో సిరీస్ పై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2026 జనవరి 11 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Read Also:  మనుషుల్లా జీవించాలని ఆశపడే రోబోలు… నవ్విస్తూనే భయపట్టే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సీజన్ 1 సంఘటనల తర్వాత 8 ఏళ్లు గడిచిన తర్వాత సీజన్ 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. జోనాథన్ పైన్ (టామ్ హిడిల్‌స్టన్) లండన్‌ లో అలెక్స్ గుడ్విన్ అనే మారుపేరుతో ప్రశాంతంగా జీవిస్తాడు. కానీ పాత కిరాయి సైనికుడిని అనుకోకుండా కలుస్తాడు. ఈ మీటింగ్ అతన్ని మళ్లీ గూఢచార్య ప్రపంచంలోకి లాగుతుంది. ఈసారి టెడ్డీ డాస్ శాంటోస్ (డియెగో కాల్వా) అనే కొలంబియన్ ఆయుధ వ్యాపారి వీళ్ళ టార్గెట్. ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలింగ్, బ్లాక్‌మెయిల్, మోసాలతో ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ గా సాగుతుంది సిరీస్. కామిలా మోరోన్ మిస్టీరియస్ రోల్‌ పోషిస్తుంది. సీజన్ 1 లాగా ఇందులో కూడా టైట్ స్క్రిప్ట్, షాకింగ్ ట్విస్ట్స్ ఉన్నాయి.

ఇండియన్ రీమేక్ ఎప్పుడు ?

‘ది నైట్ మేనేజర్’ సీజన్ 1 ఇండియన్ రీమేక్ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో ఉంది. సీజన్ 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. కానీ ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ లేదు. ఇక బ్రిటిష్ వెర్షన్ చూడాలనుకుంటే మరికొన్ని రోజులు వెయిటింగ్ తప్పదు. అలాగే ఈ ఏడాదే ఇండియన్ రీమేక్ సీజన్ 2 వస్తే డబుల్ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×