E-Paper
Advertisement

Belt Shops: గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం.. రోడ్డు ప్రమాదాలకు బెల్ట్ షాపులే కారణమా?

Belt Shops: గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం.. రోడ్డు ప్రమాదాలకు బెల్ట్ షాపులే కారణమా?
Advertisement

Belt Shops: వైన్ షాపుల్లో రోజుకు 12 గంటలు అమ్మకాలు చేస్తే బెల్టు షాపులు మాత్రం 24 గంటలు అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరగటంతో పాటు బెల్ట్ షాపుల యజమానులు లక్షల్లో బ్రాండ్ షాప్ యజమానులు కోట్లలో ప్రజలకు ఇచ్చిన విడిగా మద్యం అందుబాటులో ఉంచి, వాటికి బానిస కావడం ద్వారా సామాన్యుడిని గుల్ల చేస్తూ దోచుకుంటున్నారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వైన్ షాపుల్లో దొరకే మద్యం బెల్ట్ షాపుల్లో సైతందొరుకుతుంది. కాకపోతే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాలి. కిరాణా షాపుల మాదిరి బెల్టు షాపులో నిర్వహిస్తూ పచ్చని పల్లెల్లో ప్రశాంత వాతావరణాన్ని మందుబాబులు చెడగొడుతున్నారు. దీంతో సమాజంలో చిన్న, పెద్ద అనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు.బెల్ట్ షాపుల అమ్మకాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నాయా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా కానీ అధికారులు మాత్రం బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడరు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమ మద్యం దందా అధికారులకు పట్టవు. వారికి నెలవారి లెక్కలు ఉంటాయనే చర్చ గ్రామాల్లో జరుగుతోంది.

Also Read: Washing Machine: వాషింగ్ మెషీన్‌ను పాడు చేసే ఈ 4 పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

రోడ్డు ప్రమాదాలకు బెల్ట్ షాప్ లు కారణమా?

Advertisement

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అమ్మకాలు చేస్తుండడంతో జనాలు ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు చివరకు మైనర్ పిల్లలు కూడా మద్యం కొనుగోలు చేసి ఎక్కడపడితే అక్కడ రోడ్డు పక్కన ప్రధాన ప్రాంతాలు, పంట పొలాలలు,పాఠశాలలు, క్రీడా ప్రాంగణాలు అన్ని మద్యం సేవించే కేంద్రాలుగా మారిపోయాయి. డ్రైవర్లు మాత్రం కావలసినంత మద్యం లభించడంతో మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మార్గమధ్యంలో ఎక్కడపడితే అక్కడ మద్యాన్ని సేవిస్తూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.

అనారోగ్యం పాలవుతున్న మందుబాబులు

విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుండడంతో చిన్న పెద్ద అనే తారరమ్యం లేకుండా మధ్యాన్ని సేవిస్తున్నారు. మద్యాన్నికి అలవాటు పడినవారు మద్యం సమయానికి దొరకకపోతే నరాలు లాగటం, చేతులు వనకడం, గుండెల్లో దడ రావడం పెరుగుతోంది. మద్యానికి బానిస అయిన వారు కూలీ పనులు చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. కొందరికి ఊపిరితిత్తుల వ్యాధులు బారిన పడుతున్నారు. మరికొందరు మూత్రపిండాలు పాడైన వారు ఉన్నారు. రోగాల బారిన పడిన వారు వైద్యం తీసుకునేందుకు డబ్బు లేక నాటు మందులు వాడుతూ మృతి చెందుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆసుపత్రులకు వెళితే లక్షల్లో ఖర్చు అవుతుంది వైద్యానికి డబ్బులు లేకపోయినా మద్యం సేవించేందుకు కాయ కష్టం చేసి కుటుంబాన్ని, పిల్లలను పోషిస్తున్న భార్యలను హింసిస్తున్న వారి సంఖ్య సమాజంలో పెరుగుతోంది . పేద కుటుంబాలు ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య కలహాలు తలెత్తి విడిపోతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రజలు అనారోగ్యం పాడవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: Washing Machine Tips: ఈ దుస్తులను పొరపాటున కూడా వాషింగ్ మెషీన్‌లో వేయకండి, ఎందుకంటే?

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×