Celebrities Private Islands: ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలు సొంతంగా కొనుగోలు చేసిన ప్రైవేట్ దీవులు గురించి వైరల్ అవుతున్న వార్త అందరినీ ఆకట్టుకుంటుంది. కోట్లలో సంపాదించిన ప్రముఖులు, జనాల హడావుడికి దూరంగా ప్రశాంతంగా గడపడానికి ఈ దీవులను కొనుగోలు చేశారు. ఇక వీటి మెయింటెనెన్స్ ధర తెలిసి అందరూ షాప్ కి గురవుతున్నారు..
అడ్వెంచర్ షోలకు పేరుగాంచిన బేర్ గ్రిల్స్‌కు ప్రకృతి అంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయన స్కాట్లాండ్ దగ్గర ఉన్న St. Tudwal’s West అనే చిన్న దీవిని సుమారు $120,700కి కొనుగోలు చేశారు. అక్కడ ఆయన చాలా సింపుల్‌గా, ప్రకృతితో కలిసి జీవిస్తారు.
హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో పర్యావరణ పరిరక్షణకు పెద్ద మద్దతుదారు. ఆయన బెలీజ్‌లోని Blackadore Caye అనే దీవిని సుమారు $1.75 మిలియన్కి కొనుగోలు చేశారు. ఈ దీవిని పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీగా అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యం.
నటుడు, నిర్మాత అయిన టైలర్ పెర్రీ బహామాస్‌లోని White Bay Cay అనే దీవిని $6.4 మిలియన్కి కొనుగోలు చేశారు. ఈ దీవిని విశ్రాంతికి, అలాగే సినిమా షూటింగ్స్‌కు కూడా ఉపయోగిస్తారు.
హాలీవుడ్ నటుడు నికోలాస్ కేజ్ ఒకప్పుడు Leaf Cay అనే దీవిని $7.5 మిలియన్కి కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల తరువాత దానిని అమ్మాల్సి వచ్చింది. అయినా కూడా ఇది అప్పట్లో పెద్ద చర్చగా మారింది.
ప్రపంచ ప్రసిద్ధ గాయకుడు రికీ మార్టిన్ బ్రెజిల్‌లోని Ilha do Maia అనే దీవిని సుమారు $8 మిలియన్కి కొనుగోలు చేశారు. కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ఈ దీవిని ఆయన ఉపయోగిస్తారు.
హాలీవుడ్ స్టార్ మెల్ గిబ్సన్ ఫిజీ దేశంలో ఉన్న Mago Island అనే భారీ దీవిని $15 మిలియన్కి కొనుగోలు చేశారు. ఇది సెలబ్రిటీలు కొనుగోలు చేసిన పెద్ద దీవుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రముఖ గాయని సెలిన్ డియాన్ కెనడాలోని Île Gagnon అనే దీవిని సుమారు $25.5 మిలియన్కి కొనుగోలు చేశారు. ఇది ఆమెకు పూర్తిగా వ్యక్తిగతమైన ప్రైవేట్ ప్రాపర్టీ.
కంట్రీ మ్యూజిక్ స్టార్ దంపతులు టిమ్ మెక్‌గ్రా మరియు ఫెయిత్ హిల్ బహామాస్‌లోని Goat Cay (L’Île d’Anges) అనే దీవిని $35 మిలియన్కి కొనుగోలు చేశారు. వీరిద్దరూ ఇక్కడ ఎక్కువగా సమయం గడుపుతారు.
హాలీవుడ్ నటుడు జానీ డెప్ బహామాస్‌లోని Little Hall’s Pond Cay అనే దీవిని $75 మిలియన్కి కొనుగోలు చేశారు. ఈ దీవిలో ఆయనకు పూర్తి గోప్యత లభిస్తుందని చెబుతారు.
ALSO READ: Vishwak Sen: నా అకౌంట్లో రూ. లక్ష చూడటమే కల.. ఆ క్షణం కన్నీళ్లాగలేదు..