E-Paper
Advertisement

Big TV: ఆ మీడియాకు ఇదే మా సవాల్.. 48 గంటల టైమ్ ఇస్తున్నాం, దమ్ముంటే ప్రూవ్ చేయండి..

Big TV: ఆ మీడియాకు ఇదే మా సవాల్.. 48 గంటల టైమ్ ఇస్తున్నాం, దమ్ముంటే ప్రూవ్ చేయండి..
Advertisement

నమస్తే తెలంగాణ థర్డ్‌క్లాస్ రాతలు
లైవ్‌ల మాటున కాసుల వేట అంటూ కారుకూతలు
రెండున్నరేళ్లలో రూ.150 కోట్లకుపైగా బిల్లులు వసూలు చేసినట్లు నమస్తే తెలంగాణ కల్లబొల్లి కథనాలు
ఒక్కో కార్యక్రమానికి రూ.6.5 లక్షలు వసూలు చేస్తున్నారంటూ ఫేక్ స్టోరీ
ప్రతీ నెలా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతీ నెలా ఠంచనుగా బిల్లులు చెల్లింపు అంటూ అబద్ధపు రాతలు
సీఎం ప్రోగ్రామ్స్ లైవ్ అంటూ బీఆర్‌ఎస్ హయాంలో దోచుకున్నది ఎవరు..?
ఒక్కో ప్రోగ్రామ్ లైవ్ కవరేజ్‌కు రూ.6.5 లక్షలు వసూలు చేసిందెవరు?
అప్పట్లో లైవ్‌ టెలికాస్ట్ చేసిన ACE మీడియా వెనుకున్న బినామీలు ఎవరు..?
ఎన్నికల ఏడాది నమస్తే తెలంగాణకు, టీన్యూస్‌కు వచ్చిన ప్రభుత్వ ప్రకటనలెన్ని?
2023-24 ఆర్థిక సంవత్సరంలో నమస్తే తెలంగాణకు ఏకంగా రూ.13.74 కోట్ల యాడ్స్ ఎలా వచ్చాయి..?

బిగ్‌టీవీపై విషం చిమ్ముతున్న తెలుగు స్క్రైబ్‌
బిగ్‌టీవీకి కోట్లు కుమ్మరిస్తున్నట్లుగా దుష్ప్రచారం
బిగ్‌టీవీపై ఫేక్ ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ పెయిడ్‌ బ్యాచ్‌
తెలుగుస్క్రైబ్.. నీ కూతలకు ఆధారాలేంటి..?

Advertisement

⦿ దొంగ రాతలు.. కారు కూతలు

తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ, తెలుగు స్క్రైబ్
బిగ్‌టీవీకి ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్నట్లు ఫేక్ ప్రచారం
మీ బతుక్కి ఒక్క నిజాన్ని కూడా చెప్పరా..?
మీ కథనాలకు ఆధారం ఉందా..?
సీఎం లైవ్ ప్రోగ్రామ్స్‌ కవరేజ్‌లో జరిగిందొకటి
నమస్తే తెలంగాణ, తెలుగు స్క్రైబ్ ఫేక్ ప్రచారం ఇంకోటి
గత ప్రభుత్వంలో రూ.6.5 లక్షలకు ఒక్కో ప్రోగ్రామ్ చేసిన ACE మీడియా
ప్రస్తుతం రూ.6 లక్షలకే ఒక్కో ప్రోగ్రామ్ చేస్తున్న SAVY స్మార్ట్ సొల్యూషన్స్‌
లైవ్ కవరేజ్ పేరుతో ఎవరు ఎక్కువ వసూలు చేశారు..?
2019లో రూ.8.5 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది ACE మీడియా కాదా?
నమస్తే తెలంగాణ, తెలుగు స్క్రైబ్ స్టోరీ రాస్తే ఎవరి మీద రాయాలి..?
SAVYకి రూ.150 కోట్ల బిల్లు వచ్చిందని నిరూపించగలరా..?
నిరూపించకపోతే మీ సంస్థల్ని మూసేస్తారా..?
నిరూపిస్తే మా సంస్థలన్నీ మీకు ధారాదత్తం చేస్తాం..
మా సవాల్‌కు నమస్తే తెలంగాణ, తెలుగు స్క్రైబ్ సిద్ధమా?

Advertisement

లైవ్‌ల మాటున కాసుల వేట అంటూ మరో కల్లబొల్లి కథనాన్ని వండి వార్చింది గుమాస్తా పేపర్.. నమస్తే తెలంగాణ. ఏకంగా రెండున్నరేళ్లలో 150 కోట్ల బిల్లులను గ్రీన్ ఛానల్ రూపంలో వసూలు చేశారంటూ కారుకూతలు మొదలుపెట్టింది. గురువింద గింజ తరహాలో.. తమ కిందే ఎన్నో తప్పులు పెట్టుకున్న నమస్తే తెలంగాణ, నీతిగా పనిచేస్తున్న సంస్థలపై బురద జల్లుతూ జనం మనసుల్లో విషం నింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు లైవ్ కవరేజీల వ్యవహారంపై కల్పిత కథనాన్ని ప్రచురించింది.

⦿ ACE మీడియా వెనుకుంది ఎవరు..?

సీఎంలు, వీవీఐపీల కార్యక్రమాల లైవ్ కవరేజ్‌ను ఏజెన్సీల ద్వారా సమాచార శాఖే ఎప్పటినుంచో అందిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ధాత్రి మీడియా ఈ లైవ్ కవరేజ్ అందించగా, తెలంగాణ ఏర్పడి సీఎం కేసీఆర్ అయిన తర్వాత ఏస్ మీడియా ఆ కాంట్రాక్టును దక్కించుకుంది. కనీసం ఏ శాటిలైట్ ఛానల్‌కు సంబంధించిన సంస్థ కాకపోయినా, లైవ్ కవరేజ్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా ACE మీడియాను తెరపైకి తెచ్చి ఆ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ దక్కేలా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలే పావులు కదిపారు. ఒక్కో లైవ్ కవరేజ‌కు 4 లక్షల 95 వేలతో పాటు, సర్వీస్ టాక్స్‌ కూడా చెల్లించేలా సెప్టెంబర్ 29, 2014న జీవో కూడా ఇచ్చారు. అసలు ఈ ACE మీడియా ఓనర్‌గా తెరపైన ఓ వ్యక్తి కనిపించినా, దాన్ని తెరవెనుక ఉన్నది మాత్రం అప్పట్లో ప్రభుత్వంలో అంతా తామై నడిపించిన వ్యక్తులేనన్న సంగతి జోరుగానే వినిపించింది.

⦿ లైవ్‌ కవరేజ్ ఒక్కో ప్రోగ్రామ్‌కు…

2014
ACE MEDIA
రూ.4.95 లక్షలు

2019 (ఒప్పందం)
ACE MEDIA
రూ.8.50 లక్షలు

2019 (సవరించింది)
ACE MEDIA
రూ.6.50 లక్షలు

2023 (డిసెంబర్)
SAVY
రూ. 5 లక్షలు

2025 (జనవరి)
SAVY
రూ.6 లక్షలు

⦿ నమస్తే తెలంగాణవి అన్నీ కల్పిత వార్తలే…

2014లో ACE మీడియాకు 4 లక్షల 95 వేలకు ఒక్కో ప్రోగ్రామ్ లైవ్ కవరేజ్‌కు బిల్లు చెల్లించినా, 2023 నాటికి అది క్రమంగా పెంచుకుంటూ 6 లక్షల 50వేలకు తీసుకెళ్లారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోసారి ప్రభుత్వం టెండర్లు పిలవగా ACE మీడియా వసూలు చేస్తున్న దానికన్నా తక్కువకు కోట్‌ చేసిన సావీ స్మార్ట్ సొల్యూషన్స్‌కు కాంట్రాక్ట్‌ను కేటాయించారు. కానీ, నమస్తే తెలంగాణ మాత్రం ACE మీడియా కన్నా ఎక్కువ మొత్తానికి లైవ్ ప్రసారాలను సావీ స్మార్ట్ సొల్యూషన్స్‌కు ఇచ్చారన్నట్లుగా కల్పిత వార్తను పుట్టించింది. ACE మీడియా కు రూ.6.5 లక్షల చొప్పున ఒక్కో ప్రోగ్రామ్ లైవ్ కవరేజ్ ఇవ్వడం తప్పు కాదు గానీ, దాని కన్నా తక్కువగా రూ.6 లక్షలకే సావీ స్మార్ట్ సొల్యూషన్స్‌కు ఇవ్వడం తప్పవుతుందా..?

⦿ ఇక బిల్లుల సంగతి..

సావీ స్మార్ట్ సొల్యూషన్స్‌కు రెండున్నరేళ్లలో ఏకంగా రూ.150 కోట్ల బిల్లులు విడుదల చేశారన్నది నమస్తే తెలంగాణ కథనం చేస్తున్న దారుణమైన ఆరోపణ. నమస్తే తెలంగాణ యాజమాన్యానికి సవాల్‌.. మీకు 48 గంటల టైమ్… ఈ రెండున్నరేళ్లలో 150 కోట్లు తీసుకున్నట్లు నిరూపించండి. నిరూపించ గలిగితే మా సంస్థలన్నీ బంద్ చేసి మీకు ధారాదత్తం చేయడానికి మేం సిద్ధం.. నిరూపించలేకపోతే మీరేం చేస్తారు.. మీ సంస్థలు బంద్ చేసి… తప్పైపోయిందని చెంపలు వాయించుకుని ముక్కు నేలకు రాస్తారా.. ?

⦿ మీడియాలో ఉంటే.. ఇష్టం వచ్చినట్టు రాస్తారా..?

గ్రీన్ ఛానల్‌లో నెలనెలా కచ్చితంగా సావీ స్మార్ట్ సొల్యూషన్స్‌కు బిల్లులు వస్తున్నాయా..? అసలు స్పృహ ఉండే మాట్లాడుతున్నారా..? దీని మీద కూడా RTI వేసి నిజాలు తెలుసుకోండి. ప్రోగ్రామ్ కాస్ట్ ఇంకో రెండు లక్షలు పెంచమని మేం డిమాండ్ చేశామా..? మీ దగ్గర ప్రూఫ్ ఉందా..? దీన్ని నిరూపించగలరా? గత పన్నెండు నెలల్లో ఒక్క బిల్ అయినా సావీకి రిలీజ్ అయినట్లు చూపించగలరా..? మీరు నిరూపిస్తే మేం దేనికైనా రెడీ.. నిరూపించలేకపోతే.. మీరేం చేస్తారు.. మీ దుకాణం బంద్ చేస్తారా..? మీడియాలో ఉన్నాం కాబట్టి మేం ఆన్సర్ చేస్తున్నాం.. కానీ మీడియాలో లేని వాళ్ల సంగతి ఏంటి..? వాళ్లపై మీరు రాసే చిల్లర స్టోరీలకు వివరణ ఇచ్చుకోలగరా..?

⦿ దమ్ముంటే.. ప్రూఫ్ చేసి మాట్లాడండి..

మీరు రాసిన కథనంలో పదే పదే ప్రచారం, విమర్శలు అంటూ పేర్కొని మీది థర్డ్ క్లాస్ పేపర్ అని మరోసారి నిరూపించుకున్నారు. మీరు రాయాల్సింది ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదు.. వాస్తవం ఏంటన్నది. జర్నలిజం విలువలు మీరు పాటించి ఉంటే పక్క సాక్షాధారాలను సేకరించి రాసి ఉండేవాళ్లు.. మీకు నిజాయితీ లేదు కాబట్టి, నిజమైన వార్తలను ఇవ్వడం మీకు చేతకాదు కాబట్టి, మాపై బురద జల్లుతున్నారు. అంత రాయాలనుకుంటే.. RTI యాక్ట్ కింద దరఖాస్తు చేసుకుని అసలు నిజాన్నే తెలుసుని రాయొచ్చు కదా..? ఎదుటి సంస్థల మీద నిందలు వేయడానికి ఇంతగా దిగజారాలా..?  బిగ్‌టీవీ ప్రారంభమయ్యింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాదు… BRS అధికారంలో ఉన్నప్పుడు. నీతి, నిజాయతీతో బిగ్‌టీవీ ప్రసారాలు సాగుతున్నందుకే ప్రజల ఆదరణ మాకు దక్కుతోంది. మీ ఛానల్ , పేపర్ ఎప్పుడూ కుళ్లు కథనాలను వండి, జనం మనసుల్లో విషబీజాలు నాటడం మాకు చేతకాదు. ఏదైనా ఉంటే..విత్ ప్రూవ్స్‌తోనే టెలికాస్ట్ చేస్తాం. మీలా గుంటనక్కల్లా దొంగ దెబ్బ తీయాలని చూడం. ఇప్పటికీ మా సవాల్ అదే. మీకు 48 గంటల టైమ్.. మాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తారా..? మీ సంస్థలను బంద్ చేస్తారా..?

ALSO READ: Ponnam Prabhakar: హుజూరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×