T20 World Cup 2026: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final, ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో 96 బడుగుల తేడాతో ఇండియా గెలిచి… మూడోసారి ముచ్చటగా టైటిల్ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ గురించి పక్కకు పెడితే… స్టేడియంలో జరిగే మోసాల గురించి ఓ వీడియో బయటకు వచ్చింది. 20 రూపాయల వాటర్ బాటిల్ ను 100 నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
Also Read: Sahibzada Farhan: ఐసీసీని కోర్టుకు ఈడ్చుతా..నాకు దక్కాల్సిన అవార్డ్, సంజుకు ఎలా ఇస్తారు ?
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో ( Narendra Modi Stadium, Ahmedabad ) జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా ఫైనల్ మ్యాచ్ లో ఆడిన నేపథ్యంలో చాలా మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. మొన్న ఆదివారం స్టేడియం మొత్తం హౌస్ ఫుల్ అయింది. అయితే జనాలు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో స్టేడియానికి సంబంధించిన క్యాంటీన్ ఓనర్లు డబ్బులు దండుకున్నారు. ప్రతి వస్తువుపై ఐదు రెట్లు ఎక్కువగా ధరలు పెంచి అమ్ముకున్నారు. 20 రూపాయల వాటర్ బాటిల్ 100 నుంచి 200 రూపాయలకు విక్రయించారు. దీనిపై మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ విదేశీ అభిమాని నిలదీశాడు. అయితే క్యాంటీన్ కు సంబంధించిన సిబ్బంది ఓవరాక్షన్ చేస్తూ.. తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదు అంటూ రెచ్చిపోయారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను క్యాప్చర్ చేసిన సదరు అభిమాని.. సోషల్ మీడియాలో పెట్టి తన బాధను వెళ్లగక్కాడు.. పేరుకే నరేంద్ర మోడీ స్టేడియం అని.. లోపల మొత్తం డొల్ల అంటూ ఫైర్ అయ్యాడు. సామాన్య అభిమానిని దోచుక తింటున్నారని నిప్పులు చెరిగారు. ఈ సంఘటన ఇప్పుడు హార్ట్ టాపిక్ అయింది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన నేపథ్యంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ మోడీ స్టేడియంలో కుర్చీలు సరిగ్గా లేవని కొంతమంది నెటిజెన్స్, పోస్టులు పెడుతున్నారు. మోడీ స్టేడియంలో సరిగ్గా మెయింటెనెన్స్ లేదని విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలో వైరల్ అయిన నేపథ్యంలో సాధారణ క్రికెట్ అభిమానులు స్పందిస్తున్నారు. మోడీ స్టేడియంలో ఇకపై మ్యాచ్లు నిర్వహించకూడదని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మోడీ సర్కార్ యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతున్నారు. లేకపోతే ఇండియాపై చెడు అభిప్రాయం బయటకు వస్తుందని చెబుతున్నారు.
Also Read: Pak On Team India: అంతా ఫిక్సింగే..టీమిండియా విజయం వెనుక అమిత్ షా, ధోని, రోహిత్ కుట్రలు ?
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
🚨 PATHETIC VISUALS FROM INDIA 🚨
– An Indian fan exposed how dirty the top seats at Narendra Modi Stadium were In T20 WC final. Total terrible maintenance.
– Imagine being the so called richest board yet running stadiums with such poor management. 😂 pic.twitter.com/a9R9y8WWSr
— Salman. (@TsMeSalman) March 9, 2026