E-Paper
Advertisement

BRS Politics: హరీష్‌రావు పార్టీ మార్పు వ్యవహారం.. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? చిల్లర ప్రచారాలంటూ

BRS Politics: హరీష్‌రావు పార్టీ మార్పు వ్యవహారం.. బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?  చిల్లర ప్రచారాలంటూ
Advertisement

BRS Politics: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? పార్టీలో ఆ నేతపై తప్పుడు వార్తల వెనుక ఏం జరుగుతోంది? ఆ పార్టీ నేతలు కావాలని లీకులు ఇస్తున్నారా? ఎవరైనా పని గట్టుకుని ప్రచారం చేస్తున్నారా? ఉన్నట్లుండి ఈ వార్త బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడ్డాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

హరీష్‌రావు పార్టీ మార్పు వ్యవహారం

Advertisement

Advertisement

రాజకీయ నాయకులు పార్టీల పరంగా ఆరోపణలు, విమర్శలు గుప్పించినా, లోపల అంతా ఒక్కటేనని చెబుతారు. అలాంటి సందర్భాలు రిపీట్ అయ్యాయి కూడా. పండుగలు, పెళ్లిళ్లు వేళ ఒకరినొకరు పలకరింపులు, మంచి చెడులు మాట్లాడుకుంటారు. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హరీష్‌రావు పార్టీ మారుతున్నారని ఓ వార్త తెగ హంగామా చేసింది. కేంద్రమంత్రి అమిత్ షాతో ఆయన చర్చలు జరిపారని, బీజేపీ నుంచి క్లియర్‌గా సంకేతాలు వచ్చాయన్నది ఆ వార్త సారాంశం. అందులో నిజమెంతో తెలీదు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్లుండి హరీష్‌రావు ఈ పని చేయడమేంటని చర్చించుకుంటున్నారు.

బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

పరిస్థితి గమనించిన బీఆర్ఎస్ పార్టీ రాత్రికి రాత్రే క్లారిటీ ఇచ్చింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పని గట్టుకొని ఇలాంటి చిల్లర ప్రచారాలను ఎవరు నమ్మవద్దని పేర్కొంది. ​మనందరి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడమే.. కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయడమేనని ఎక్స్ వేదకిగా రాసుకొచ్చింది.

నిప్పులేనిదే పొగరాదని అంటుంటారు నేతలు. రీసెంట్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఉప సభా నాయకుడిగా హరీష్‌రావుని ప్రకటించిన తర్వాత ఇలాంటి వార్త రావడం ఇదే తొలిసారి. కావాలనే కొందరు ఆ తరహా లీకులు ఇస్తున్నారని అంటున్నారు. దీని వెనుక కారు పార్టీలో ఏదో జరుగుతోందనే చర్చ లేకపోలేదు. 

ALSO READ:  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ..  అర్ధరాత్రి నుంచి ఇళ్ల ముందు భోగి మంటలు

కేటీఆర్ మద్దతుదారులు ఇలాంటి ఎత్తుగడ వేశారా? లేకుంటే కవిత సపోర్టులు ఈ పని చేశారా? ఈ విషయంలో కారు పార్టీ నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. ఏడేళ్ల వెనక్కివెళ్తే.. 2018 ఎన్నికల ఫలితాలు రాకముందు హరీష్‌రావు బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయనతోపాటు చాలామంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారంటూ అప్పట్లో పెద్ద చర్చ సాగింది.

బీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టడం, కేబినెట్ కూర్పులో హరీష్‌రావుని కేసీఆర్ దూరం పెట్టడం జరిగిపోయింది. కొద్దిరోజుల గ్యాప్ తర్వాత హరీష్‌రావు మంత్రిగా పగ్గాలు చేపట్టారని అంటున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ మూడుముక్కలాట ఉండేదని, ఇప్పుడు రెండుకి చేరిందని అంటున్నారు. రానున్నరోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×