E-Paper
Advertisement

Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. అర్ధరాత్రి నుంచే భోగి మంటలు.. సీఎంల శుభాకాంక్షలు

Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. అర్ధరాత్రి నుంచే భోగి మంటలు.. సీఎంల శుభాకాంక్షలు
Advertisement

Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పెద్ద పండుగలో భాగంగా మొదటి రోజైన భోగి వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెల్లవారుజామునే నిద్రలేచి, ఇంటి ముందు కళ్లాపి చల్లి, రంగురంగుల ముగ్గులు వేశారు. పాత సామాగ్రిని, పనికిరాని వస్తువులను మంటల్లో వేసి, చెడును వదిలించుకుని కొత్త వెలుగులకు ఆహ్వానం పలుకుతూ భోగి మంటలు వేయడంతో పండుగ సందడి మొదలైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు..
పర్వదినం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించడం, కొత్త బట్టలు ధరించి విందు భోజనాలు ఆరగించడంతో పండుగ వాతావరణం నెలకొంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కోలాహలం గ్రామాల్లో సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.

Advertisement

మంచు వారి ఇంట భోగి సందడి
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు నివాసంలో భోగి వేడుకలు ఎంతో సందడిగా సాగాయి. తిరుపతిలోని తమ నివాసంలో మోహన్ బాబు, మంచు విష్ణు కుటుంబ సభ్యులు కలిసి భోగి మంటలు వేసి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి పండుగ జరుపుకోవడం మంచు వారి ఇంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వారు ఫోటోలు దిగుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement

తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి మంటలు
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కూడా భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద శాస్త్రోక్తంగా భోగి మంటలు వేశారు. ఈ వేడుకల్లో టీటీడీ ఉన్నతాధికారులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి.

 ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చేరాలనేది తమ సంకల్పమని, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, సేవారంగాల్లో తెలంగాణ తిరుగులేని పురోగతి సాధిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కొలిక్కివచ్చిన వివాదం.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పండుగ జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా పండుగ వేళ పతంగులు ఎగరేసేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు.

తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు 

తెలుగు ప్రజలకు సీఎం నారా చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని… అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాని X వేదికగా తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

అలాగే ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి మంటల వెలుగులు మీ జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని, సిరిసంపదలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలియజేశారు. అంతేకాకుండా భీమవరంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. ఇలా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పలువురు నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×