E-Paper
Advertisement

అండగా ఉండండి.. మీకు ఏం కావాలో నేను చూసుకుంటా-సీఎం రేవంత్‌రెడ్డి

అండగా ఉండండి..  మీకు ఏం కావాలో నేను చూసుకుంటా-సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy: ముదిరాజ్‌లకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి‌గా అవకాశం కల్పించిందన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ఆలోచన పార్టీ చేస్తున్నట్లు మనసులోని మాట వెల్లడించారు. ఎమ్మెల్సీ సీటు అంశంపై పీసీసీతో చర్చిస్తానని తెలియజేశారు.

సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

గురువారం రవీంద్రభారతిలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, దొరల దోపిడీకి, పెత్తందారుల అన్యాయాలను ఎదురొడ్డి నిలిచిన వీరుడు సాయన్న ముదిరాజ్ అని, ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దొరలు ఆక్రమించిన భూములను తన పోరాటంతో పేదలకు సాయన్న పంచి పెట్టారని, చరిత్ర పుటల్లో ఆయనకు ఓ పేజీ ఉండాలన్నారు. ఆయన పోరాటాన్ని ఇప్పటికీ జానపదాలుగా పాడుకుంటారని ఈ సందర్భంగా వివరించారు ముఖ్యమంత్రి.

అండగా ఉండండి.. మీకు ఏం కావాలో నేను చూసుకుంటా-సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

నాకు ఓపిక ఉందని, ఫాం హౌజ్‌లో పండుకోలేదన్నారు. నేను ఎప్పుడు మీ వెంటే ఉంటానన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు హైటెక్ సిటీ కట్టారని, కేసీఆర్ రైతు భరోసా ఇస్తే దాన్ని రూ. 2000 పెంచి అందరికీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ తెచ్చిన పథకాల అంటే ఇంకా నాలుగు ఎక్కువ పెట్టామన్నారు. ఎన్నికలు మీరు చూసుకోవాలని,  పాలన నేను చూసుకుంటానని తెలిపారు. మూడేళ్లలో ఒక్క రోజు సెలవు తీసుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణ పోరాట యోధులను ప్రజా ప్రభుత్వం గుర్తించిందని, ట్యాంక్ బండ్ వద్ద దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కొడంగల్‌ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజ్‌ లదేనని, గతంలో వారు చేసిన సాయం ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. జనగణనలో కులగణన చేసి వందేళ్లలో ఎవరూ చేయని పనిని ప్రజా ప్రభుత్వం చేసిందన్నారు. ఏడాదిలో కులగణన పూర్తిచేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని, బీసీ ఏ లోకి మార్చాలని ముదిరాజ్‌లు కోరుతున్నారని తెలిపారు. బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యమని, ఎల్‌నినో కారణంగా మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరిగాయని, ఇప్పుడు అనేకమంది పేదలు సన్న బియ్యం తింటున్నారని వివరించారు.

Advertisement

ALSO READ: మీ బాధలో మేమున్నూ.. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Related News

మీ బాధలో మేమున్నూ.. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మైసూరు దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి సన్నిధిలో ప్రత్యేక పూజలు!

దసరా ట్రిప్‌కి వెళ్లొచ్చేసరికి దారుణం.. కుషాయిగూడలో 30 తులాల బంగారం చోరీ!

నీటిని వృథా చేయవద్దు.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి: సీతక్క

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

సాహిల్ ఫుడ్స్‌పై TG SAFE దాడులు.. 55 టన్నుల ఫుడ్ సీజ్!

Big Stories

Advertisement
×