E-Paper
Advertisement

సంక్రాంతి తప్ప వేరే డేట్ కనిపించలేదా? మెగా హీరో సినిమాకు బెదిరింపు ఫోన్ కాల్స్?

సంక్రాంతి తప్ప వేరే డేట్ కనిపించలేదా? మెగా హీరో సినిమాకు బెదిరింపు ఫోన్ కాల్స్?
Advertisement

Sambarala Yetigattu Movie: సంక్రాంతి పండుగ అంటేనే చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఇలా సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ సినిమాలు భారీగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటాయి. అయితే ఏ సినిమా బాగా ఉంటే ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది బడా హీరోల సినిమాలు విడుదల అవుతుంటే చిన్న సినిమాలను తప్పుకోవాలి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి (Chaitanya Reddy)ఇదే విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చైతన్య రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైతన్య రెడ్డి త్వరలోనే మెగా హీరో సాయి ధరంతేజ్(Sai Dharam Tej) నటించిన సంబరాల ఏటిగట్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. ఇలా ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్న నేపథ్యంలో నిర్మాత చైతన్య రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలుస్తోంది.

రిలీజ్ డేట్ వెనక్కి తీసుకోవాలి..

Advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడుతూ..2027 జనవరి 12న సంక్రాంతి బరిలోకి వస్తామని ప్రకటించినందుకు తనకు ఫోన్లు చేసి సంక్రాంతి తప్ప వేరే డేట్ ఏది కనిపించలేదా? రిలీజ్ డేట్ వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసినట్టు నిర్మాత చైతన్య రెడ్డి వెల్లడించారు. అంతేకాదు.. ఆ తేదీన సినిమా ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు. ఇలా తమ సినిమా సంక్రాంతి బరిలో దిగుతుందనే విషయం తెలియగానే మాకు బెదిరింపులు వచ్చాయి అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలకు కారణమయ్యాయి.

సంబరాల ఏటిగట్టు సంక్రాంతికి వచ్చేనా..

సాయి ధరమ్ తేజ్ మెగా హీరో అనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా మెగా హీరో సినిమాకే బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఇక చిన్న హీరోల సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సినిమాల పోటీ మధ్య విడుదల తేదీల విషయంలో ఒత్తిళ్లు రావడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ బెదిరింపులకు భయపడి సంబరాల ఏటిగట్టు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందా? లేదంటే ధైర్యంతో సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: రింగ్ దొరకక ప్రపోజ్ చేయలేదు.. ఆ మూమెంట్ మిస్సయిన రష్మిక: విజయ్ దేవరకొండ

Related News

బిజినెస్ లో సమంత దూకుడు.. 8 నెలల్లోనే రూ. 120 కోట్ల లాభాలు..పోస్ట్ వైరల్!

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!

‘నల్లమల’ డైరెక్టర్ రవి చరణ్ కొత్త మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్.. వారే టార్గెట్ గా!

విశ్వక్ సేన్ ఎదురుగా లైవ్‌లో వ్యక్తిని షూట్ చేసిన యాంకర్, అతడి పరిస్థితి ఎలా ఉందంటే?

ఆ భయమే నన్ను వెంటాడుతోంది.. రష్మిక బ్రతిమలాడడంపై విజయ్ షాకింగ్ రియాక్షన్!

నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి.. జాన్వీ వివాదంపై రష్మిక రియాక్షన్!

మెగా హీరో చేసుకోబోయే అమ్మాయి ఈమెనా..?

Big Stories

Advertisement
×