E-Paper
Advertisement

మీ బాధలో మేమున్నూ.. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మీ బాధలో మేమున్నూ.. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎంతో అంకితాభావంతో విధులు నిర్వర్తించి, అమరులైన పోలీసు కుటుంబాలు ఒంటరి కాదని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండదండలు  తప్పకుండా ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అమరులైన పోలీసులను స్మరించుకునే ఈ రోజు ఎంతో భావోద్వేగమైన రోజుగా సీఎం అభివర్ణించారు. సమాజంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 154 మది మంది అమరులైనారని, మన  తెలంగాణ రాష్ట్రంలో ఏఎస్ఐ దేవి సింగ్, పోలీస్ కానిస్టేబుళ్లు ఎంపల్లి ప్రమోద్ కుమార్, శీలం కమలాకర్ తో పాటుగా ఎక్సైజ్ శాఖ నుండి గాజుల సౌమ్య విధి నిర్వహణలో మరణించారని సీఎం వెల్లడించారు.

ఎక్స్-గ్రేషియా పెంపు

Advertisement

శాంతిభద్రతల పరిరక్షణలో వారి త్యాగాలను మరువలేమని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించాలంటే   శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. అందుకే పోలీస్ శాఖకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. పోలీస్ శాఖలో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను 2027 లోపు ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 డీఎస్పీలను నియమించామని, ట్రాన్స్ జెండర్స్ ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచామన్నారు. గతంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్ల కు రూ. 40 లక్షలు ఎక్స్గ్రేషియా ఉంటే దానిని ఏకంగా రూ.కోటికి పెంచామని, హెడ్‌ కానిస్టేబుళ్ళు, ఏఎస్‌ఐ లకు గతంలో రూ.45 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.కోటికి పెంచామని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన సబ్ ఇన్ స్పెక్టర్లకు రూ.45 లక్షలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.50 లక్షలుగా ఉంటే, దీన్ని ఏకంగా రూ. 1.25 కోట్లు కు పెంచామని సీఎం స్పష్టం చేశారు. డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారులకు రూ. 50 లక్షలు ఉంటే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .రూ. కోటిన్నరకు పెంచామని స్పష్టం చేశారు. ఎస్పీ, ఐపీఎస్‌ అధికారులకు రూ. కోటి పరిహారం ఉండగా, దాన్ని ఏకంగా రూ. 2 కోట్ల కు పెంచామన్నారు. ఇది కేవలం ఆర్ధిక సహాయం కాదని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప గౌరవమని సీఎం వ్యాఖ్యానించారు.

డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు..

Advertisement

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించి హోమ్ గార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు వారి పిల్లలకు ఇందులో చదువుకునేందుకు అవకాశం కల్పించామని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే హోంగార్డుల కుటుంబాలకు అందిస్తున్న ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెచుతున్నట్లు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాలంతో పాటు నేర స్వభావం మారుతుందని, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని, సాంకేతికత ఎంత పెరిగినా పోలీసులు మానవీయ దృక్పథం మారకూడదని, డ్రగ్స్, గంజాయి వ్యాప్తి అత్యంత ప్రమాదకరమని, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును, డీజీపీని అభినందిస్తున్నట్లు సీఎం తెలిపారు. కల్తీ ఆహార విక్రయాలను ఉక్కు పాదంతో అణచివేసేందుకు టీజీ సేఫ్ ను తీసుకొచ్చామని,  షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తూ మహిళల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని,  మహిళలకు అండగా నిలిచే సామాజిక బాధ్యతను పెంచడానికి స్టాండ్ విత్ హెర్ కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

అమరవీరుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం..

మహిళలు, పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ అందించడానికి ఏప్రిల్‌లో స్పందన రక్షణ బృందాలను ప్రారంభించామని తెలిపారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదుని సీఎం సూచించారు. మహిళల భద్రత కేవలం పోలీసు శాఖ బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని సూచించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానని, మీరు కోల్పోయిన వ్యక్తిని ఎవరూ తిరిగి తీసుకురాలేరని, మీ కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేరని, కానీ మీ బాధలో మీరు ఒంటరివారు కాదని, మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

నిజాయతీగా సేవ చేయడమే అమరులకు నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్ 

ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, ప్రతి పోలీసు నిజాయితీగా ప్రజలకు సేవ చేయటమే అమరులకు నిజమైన నివాళి అని డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తీవ్రవాదం, నక్సలిజం, మావోయిజం, ఇతర అసాంఘిక శక్తులను ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, నక్సలైట్ల హింసను ఎదుర్కొనే క్రమంలో వందలాది మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వారి ధైర్యసాహసాల ఫలితంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడి అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కర్రెగుట్ట వంటి మారుమూల ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం పోలీసుల పట్టుదలకు నిదర్శనమన్నారు. 1997లో తాను నిజామాబాద్‌ ఎస్పీగా పని చేసిన సమయంలో 126 మంది పోలీసులు అమరులైన ఘటనను గుర్తుచేస్తూ, మందుపాతరలు, కాల్పులు, పోలీసు సిబ్బందిపై దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

అధికారులకు ఆదేశాలు..

అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఇతర ప్రయోజనాలు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పండుగలు, సెలవు రోజుల్లోనూ ప్రజల భద్రత కోసం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (వైఐపీఎస్‌)ను ప్రారంభించిందని, ప్రస్తుతం సుమారు 350 మంది విద్యార్థులు  చదువుకొంటున్నారని తెలిపారు.  మంచిరేవులలో శాశ్వత క్యాంపస్‌ ఏప్రిల్ నాటికి పూర్తయితే  సుమారు 720 మంది విద్యార్థులకు విద్య అందించే అవకాశం ఉంటుందని, పోలీసు సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ జనాభాలో కేవలం 0.3 శాతం మందికే పోలీసు యూనిఫాం ధరించి ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని డీజీపీ పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు చట్టప్రకారం, నిజాయతీతో పరిష్కారం చూపాలని, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తూ ప్రజలకు నిబద్ధతతో సేవలందించడమే పోలీసు అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.

Also Read: మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

Tags

Related News

మైసూరు దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి సన్నిధిలో ప్రత్యేక పూజలు!

దసరా ట్రిప్‌కి వెళ్లొచ్చేసరికి దారుణం.. కుషాయిగూడలో 30 తులాల బంగారం చోరీ!

నీటిని వృథా చేయవద్దు.. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి: సీతక్క

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

సాహిల్ ఫుడ్స్‌పై TG SAFE దాడులు.. 55 టన్నుల ఫుడ్ సీజ్!

తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పుల వేళ.. సరిదిద్దుకోకపోతే దెబ్బే?

Big Stories

Advertisement
×