BigTV English

CM Revanth challenge kcr trouble: సీఎం రేవంత్ ఉచ్చులో కేసీఆర్, రాత్రి ఇంట్లో ఏం జరిగింది?

CM Revanth challenge kcr trouble: సీఎం రేవంత్ ఉచ్చులో కేసీఆర్, రాత్రి ఇంట్లో ఏం జరిగింది?

CM Revanth challenge to KCR(Telangana politics): తెలంగాణలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ లోగుట్టు విప్పే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిందా? సీఎం రేవంత్‌రెడ్డి ఛాలెంజ్‌కి బీఆర్ఎస్ వెనుకడుగు వేసిందా? ప్రభుత్వాన్ని ఇరుకున పెడదారని భావించి కేసీఆర్‌ను ఆ పార్టీ నేతలే ఇరికించారా? తెలంగాణ కోసం అమరణ దీక్ష చేసిన కేసీఆర్, కేంద్రం నుంచి నిధుల కోసం మరోసారి సిద్ధమవుతున్నారా? రాత్రి కేసీఆర్ ఇంట్లో దీనిపై ఎలాంటి చర్చ జరిగింది? అనేదానిపై రకరకాలుగా వార్తలు హంగామా చేస్తున్నాయి.


ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెత బీఆర్ఎస్ నేతలు కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్‌రెడ్డిని ఇబ్బందులు పెట్టాలని బీఆర్ఎస్ కీలక నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు అడ్డంగా దొరికిపోతున్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో కేంద్రబడ్జెట్‌పై రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తీర్మానం పెట్టింది అధికార ప్రభుత్వం. దీనిపై అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

కేటీఆర్ మాట్లాడుతూ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణదీక్షకు కూర్చోవాలని సూచన చేశారు. ఈ విషయంలో మా ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా వస్తారన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాము ఎప్పుడూ చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించామని చెప్పుకోలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, సభాపక్ష నాయకుడిగా తాను ఇద్దరం కలిసి నిధుల కోసం ఢిల్లీలో దీక్షకు దిగుతామని ఛాలెంజ్ విసిరారు. సీఎం మాటలకు విపక్షం సైలెంట్ అయిపోయింది.


ALSO READ: బడ్జెట్ ఎఫెక్ట్..బీజేపీకి ‘లోకల్’ సెగ

నిధుల కోసం ఢిల్లీలో కేసీఆర్.. సీఎం రేవంత్‌తో కలిసి దీక్షకు కూర్చొంటారా? లేదా అన్నది అసలు ప్రశ్న. ఈ వ్యవహారంపై రాత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట్లో చిన్నపాటి చర్చ జరిగినట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. సీఎం చాలా తెలివైనవారని, ఆయనతో డైరెక్ట్ మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచన చేశారట. మీరు నోరు విప్పి.. తనను అడ్డంగా బుక్ చేశారని పెద్దాయన అన్నారట. వీచే గాలికి ఎదురు వెళ్లకూడదని, దాని ప్రభావం తగ్గిన తర్వాత అప్పుడు వెళ్లాలన్న సామెతను గుర్తు చేశారట. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది.

 

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×