BigTV English

Zomato Boy In Mumbai Slums| రూ.500 ఇంటి రెంటు..దుర్భర జీవితం.. కలలు సాకారం చేసేందుకు జొమాటో బాయ్ పోరాటం

Zomato Boy In Mumbai Slums| రూ.500 ఇంటి రెంటు..దుర్భర జీవితం.. కలలు సాకారం చేసేందుకు జొమాటో బాయ్ పోరాటం

Zomato Boy In Mumbai Slums| ముంబై లోని స్లమ్ లలో జీవించే జొమాటో డెలివరీ బాయ్ ప్రన్ జాయ్ బోర్గొయారి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో తన జీవితం గురించి వీడియో షేర్ చేశాడు. ఈశాన్య రాష్ట్రాలనుంచి ముంబైకి వలస వచ్చి.. ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. ఆ గదిలో ప్రతి మనిషి నెలకు రూ.500 చెల్లించాలి. గది చాలా ఇరుక్కుగా.. చిన్నదిగా ఉంది. ఆ చిన్న గదిలో తాను ఎన్ని ఇబ్బందులు పడి జీవిస్తున్నాడో చెబుతూ.. ఇన్స్ టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో చాలా వైరల్ అయింది.


ప్రాన్ జాయ్ ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకు 45 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ముంబైలోని ఓ ఇరుకైన ప్రాంతంలో కేవలం మనిషి నడవడానికే కష్టంగా ఉన్న దారి నుంచి ప్రాన్ జాయ్ తాను నివసిస్తున్న ఇంటికి చేరుకుంటాడు. అక్కడ చూస్తే.. ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది.. కానీ పైకి ఎక్కడానికి ఇరుగ్గా.. నిటారుగా ఉన్న మెట్లు ఎక్కాలి.. ఏదో తలదాచుకోవడానికి అతి కష్టం మీద ఆ గదిలో ఎలాగోలా చేరుకుంటాడు ప్రాన్ జాయ్. ఇంట్లో అతనితో పాటు మరో స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఇద్దరూ తలా రూ.500 నెలకు అద్దె చెల్లిస్తున్నారట.

Also Read:  ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!


ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో నుంచి తన జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు ముంబై వచ్చిన ప్రాన్ జాయ్.. ఒక ఫుట్ బాల్ ఆటగాడు. ఒక సంగీతకారుడు. తాను ఒక మంచి సింగర్ అనిపించుకోవాలనేది ప్రాన్ జాయ్ కోరిక. అందుకోసమే కలల నగరం ముంబైలో తన కల సాకారం చేసుకునేందుకు వచ్చాడు. కానీ జేబులో డబ్బులు లేవు. అందుకే జీవనం సాగించేందుకు జొమాటో డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అలా వచ్చిన సంపాదనతో ఆ ఇరుకైన ఇంట్లో తన స్నేహితుడితో పాటు ఒక పిల్లిని కూడా పెంచుకుంటున్నాడు.

ప్రతిరోజు జీవితంతో పోరాడుతున్నా.. అతను నిరుత్సాహపడలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా సోషల్ మీడియాలో తన పాడుతూ.. గిటార్ వాయిస్తూ.. వీడియోలు షేర్ చేస్తుంటాడు. తాజాగా ప్రాన్ జాయ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో అతడిని నెటిజెన్లు పొగుడుతున్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ.. ప్రాన్ జాయ్ ని ఆదర్శంగా తీసుకోవాలని అంటూ ఒక ఇన్స్‌టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేస్తే.. మరొకరు ప్రాన్ జాయ్‌ ని కొరియా కె పాప్ సింగర్స్ తో పోల్చాడు.

Also Read:  యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

ఖుషీ అనే ఒక ఇన్స్‌టాగ్రామ్ యూజర్ అయితే ప్రాన్ జాయ్ నివసిస్తున్న ఇంటికి మూడు నెలల అద్దె చెల్లించింది. నెటిజెన్లు తన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆదరణ తనకు మరింత ధైర్యం ఇచ్చిందని ప్రాన్ జాయ్ తెలిపాడు. ఏదో ఒకరోజు తాను అనుకున్నది సాధిస్తానని అన్నాడు.

 

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×