Illu Illalu Pillalu ToIlluday Episode August 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. అన్ని సమస్యలు తీరిపోయాయని భాగ్యం ఆనందరావు సంతోషంగా ఉంటారు. భాగ్యం ఆనందరావు మనం ఇక దాచాల్సిన అవసరం లేదు మన ఆస్తులు పోయాయి. మన వ్యాపారం ఇదే అని చెప్పుకోవాల్సింది. ఇక నువ్వెందుకు టెన్షన్ పడతావు ఆ ప్రేమ నర్మదా ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అయితే అప్పుడే శ్రీవల్లి వచ్చి ఈ సమస్య ఎక్కడ పోయింది మా ఆయనకు మీరు ఇవ్వాల్సిన 10 లక్షలు అలాగే ఉండిపోయాయి ఆయన నాతో మాట్లాడుతున్నాడా? నాకు కాపురం కూలిపోయేలా ఉంది అని బాధపడుతుంది. ఆ ప్రేమ, నర్మదాల గురించి ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది వాటిని బయట పెడితే మనం ఎస్కేప్ అవ్వచ్చు అని భాగ్యం అంటుంది. ముగ్గురు కలిసి భారీ ప్లానే వేస్తారు. తిరుపతి ఒక అమ్మాయిని చూసి ఫిదా అయిపోయాను.. అమ్మాయితో మాట్లాడను లెటర్ కూడా రాశాను కలవలేకపోయాను అని అంటాడు. లెటర్ రావడం చూసి అది నాకే నీ సంబరపడిపోతాడు. అది చూసిన ప్రేమ మీకు కాదు నాకు అని చెప్పడంతో షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… తిరుపతికి వచ్చిన లెటర్ అనుకోని ప్రేమ దాన్ని ఎంతో ఆశగా ఓపెన్ చేస్తుంది కానీ అందులో తాను, తన మాజీ బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్తో కలిసిన ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఇక ఏమి మాట్లాడలేక పోతుంది.. ఆ లెటర్ ఎవరికి వచ్చిందని అడుగుతారు కానీ ప్రేమ మాత్రం అది నాకే వచ్చింది కాలేజ్ నుంచి వచ్చింది అని చెప్పేసి కవర్ చేస్తుంది. ధీరజ్మాత్రం లెటర్ నీకు వచ్చిందా ఎవరు పంపారు అని అడుగుతాడు. కాలేజీ నుంచి వచ్చింది అని ప్రేమ అబద్ధం చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది.. అయితే ఆ ఫోటోలను చూస్తున్న ప్రేమ దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది.
గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న ప్రేమ ఆ ఫోటోలను తీసి మల్ల ఒకసారి చూస్తుంది. ఈ ఫోటోలు కనక మామయ్య ఇంకేముంది. అత్తయ్య బలవంతంగా నాకు తెలియదు పెళ్లి చేసిన విషయం తెలిస్తే ఇక్కడ రచ్చ రచ్చ అవుతుంది అని భయపడుతుంది. నేను చూశాను కాబట్టి సరిపోయింది అదే ఇంకెవరైనా చూస్తుంటే అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది.. ప్రేమకు ఓ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి ఎవరిది ఈ నెంబర్ అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
ఆ ఫోన్ లోని గొంతు నీ గుర్తుపట్టి కళ్యాణ్ అని అంటుంది. పర్లేదే నా నెంబర్ మార్చిన నా గొంతును బాగానే గుర్తుపట్టావని అతను అంటాడు. నీవల్ల నా జీవితం నాశనం అయిపోయింది నా జల్సాలకు అడ్డుకట్ట పడింది. నువ్వు తెచ్చే డబ్బులు బంగారం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానో కానీ నువ్వు నన్ను మోసం చేసి వేరే వారిని పెళ్లి చేసుకున్నావు. నాకు అమ్మాయిలను ప్రేమించి వాళ్ళని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం అలవాటు. మీ వల్ల ఆ ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది.
ఇప్పుడు నువ్వు నాకు ఆ డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. లేదంటే మనం దిగిన ఫోటోలను మీ మామయ్య రైస్ మిల్లుకు.. లేదా ఊరంతా బ్యానర్లో ఇస్తాను అప్పుడు మీ ఇంటి పరువు మీ అత్తింటి పరువు పోతుంది అని భయపెడతాడు. ప్రేమ నేను కలుస్తాను అని అంటుంది. ఈ విషయం ధీరజ్ కు తెలిస్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటాడని అబద్ధం చెప్తుంది. ఇక కళ్యాణి ఎలాగైనా కలవాలని అనుకుంటుంది.
అటు నర్మదా సాగర్ లు వాళ్ల ఫాస్ట్ ని గుర్తు చేసుకుంటారు.. అక్కడ కూడా నర్మద చేత చివాట్లు తింటాడు సాగర్.. శ్రీవల్లి చందు మాటల్లేదని బాధపడుతూ ఉంటుంది. చందు ని సేటు మరోసారి వచ్చి అడుగుతాడు షాపులో అందరి ముందర పరువు తీస్తాడు. దాన్ని అవమానంగా ఫీల్ అవుతాడు చందు. నాన్నగారికి ఈ విషయం తెలిస్తే కచ్చితంగా నన్ను ఇంట్లో ఉండనివ్వడు నా మొహం కూడా చూడడు అని కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
Also Read : మీనాను అవమానించిన రోహిణి.. మనోజ్ దెబ్బకు చెమటలు.. రౌడీగా మారిన బాలు..
ఇంత చేసిన కూడా తన భర్త తనకి దూరమైపోయాడని శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ కళ్యాణి కలవడానికి వెళుతుంది. మధ్యలో ధీరజ్ వచ్చి ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నావని అడుగుతాడు. ధీరజ్ నన్ను ఫాలో అవుతాడా ఏంటి అని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఎలాగైనా సరే ధీరజ్ని తప్పించుకుని వెళ్లాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రేమని ధీరజ్ కాపాడుతాడేమో చూడాలి…