Pa.Ranjith : ఆస్కార్.. కాలం మారుతున్న కొద్దీ అటు సినిమా రంగంలో కూడా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అద్భుతమైన కథలతో ప్రేక్షకులను మెప్పించి, ఆస్కార్ దిశగా అడుగులు వేస్తున్నారు దర్శకనిర్మాతలు. అటు నటీనటులు కూడా తన శక్తికి మించి నటిస్తూ అవార్డులు అందుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమా రంగంలో అందించే అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కోసం దర్శకలు ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెలుగులో రాజమౌళి (Rajamouli) ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకోవాల్సి ఉంది. కానీ కొంచెంలో మిస్సయింది. అయితేనేం ఈ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా సరే ఆస్కార్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి.
ఆస్కార్ ఎంట్రీ పొందిన పా. రంజిత్ మూవీ..
ఇదిలా ఉండగా ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ పా.రంజిత్ (Pa .Ranjith) మూవీకి అరుదైన గౌరవం లభించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ పా.రంజిత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ సహ నిర్మాతగా వ్యవహరించిన ‘పాపా బుకా’ చిత్రం 98వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ఎంట్రీ సాధించింది. పపువా న్యూ గినియా (PNG) దేశం నుంచి అర్హత పొందిన తొలి సినిమాగా ఇది రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం విభాగంలో ఈ సినిమా ఇప్పుడు పోటీ పడబోతోంది. అటు 3 నేషనల్ అవార్డులు అందుకున్న మలయాళ దర్శకుడు బిజుకుమార్ దామోదరం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం ఇది – పా. రంజిత్
ఈ విషయాన్ని పా.రంజిత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేస్తూ.. “అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో 98వ అకాడమీ అవార్డులకు పాపా బుకా అధికారికంగా ఎంపికైంది. పపువా న్యూ గినియా దేశం ఎంట్రీగా ఎంపికైందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. భారతదేశం నుంచి నిర్మాతలలో ఒకరిగా.. రెండు దేశాల సహా నిర్మాణంలో భాగం కావడం నీలం ప్రొడక్షన్స్ కి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాము. ఈ ప్రయాణానికి మద్దతుగా.. ఈ కథను ప్రపంచ వేదిక పైకి తీసుకెళ్లడంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం ఇది. ఈ సినిమా మరిన్ని ప్రశంసలు పొందడం రెండు దేశాలకి గర్వకారణం. ఈ ఘనత సాధించిన పాపా బుకా చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అంటూ ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాపా బుకా సినిమా విశేషాలు..
ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి డైరెక్టర్ బిజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పపువా న్యూ గినియా కి చెందిన నోయెలీన్ తౌలా వునమ్, ఇండియాకి చెందిన అక్షయ్ కుమార్ పరిజా, పా.రంజిత్, ప్రకాష్ బేరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 19 2025న న్యూ గినియా దేశంలో థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రదర్శనలు, అకాడమీ అవార్డుల కోసం లాస్ ఏంజెల్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.
It is a proud moment for me to state that Papa Buka has been officially selected as Papua New Guinea’s entry for the 98th Academy Awards in the International Feature Film category. As one of the producer from India, it has been an honour for Neelam Productions to be part of this… pic.twitter.com/3aEkSFP1DM
— pa.ranjith (@beemji) August 27, 2025
also read: Lakshmi Menon: కిడ్నాప్ కేసులో హీరోయిన్ కి భారీ ఊరట.. అసలేం జరిగిందంటే?