Nindu Noorella Saavasam Serial Today Episode: కింద దీపాలు వెలిగించి మిస్సమ్మ పైకి వెళ్తుంది. మిస్సమ్మ పైకి వెళ్లడం చూసిన ఆరు భయంగా మిస్టర్ గుప్త మళ్లీ మిస్సమ్మ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఎలాగైనా ఆపండి అని అడుగుతుంది. వేచి చూడుము బాలిక ఎందుకు కంగారు అంటాడు గుప్త. ఇంతలో అమర్ వాళ్లు ఆరు ఫోటోకు దండం పెట్టుకుని బయటకు వస్తారు. మిస్సమ్మ పైకి వెళ్లగానే అమర్ రూం లాక్ చేస్తాడు. అయ్యో ఈసారైనా అక్క ఫోటో చూడలేకపోయాను అని మనసులో అనుకుంటూ కిందకు వెళ్తుంది.
మరోవైపు గార్డెన్ లో ఆలోచిస్తూ కూర్చున్న ఆరు దగ్గరకు తుమ్మెద రూపంలో ఉన్న గుప్త వెళ్లి ఏమైంది బాలిక ఎందుకు విచారంగా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో ఆరు నా కోసం ఇంత చేస్తున్న నా ఫ్యామిలీని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. నేను దూరమై ఇన్ని రోజులైనా కూడా అంత అభిమానాన్ని నేను ఎలా పొందుతున్నానా అని ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు పోతే రేపు రెండో రోజు అనుకునే ఈ రోజుల్లో కూడా ఇంత ప్రేమను పొందడం నాకు చాలా అంటే చాలా అదృష్టంగా అనిపిస్తుంది. అనాథ శరణాలయంలో ఉన్నన్ని రోజులు చాలా బాధపడేదాన్ని. నాకంటూ ఎవ్వరూ లేరని అలాంటప్పుడు నేను బతికి లేకపోయినా నాకోసం ఇంత మంది ప్రేమను చూపిస్తున్నారు అంటూ ఎమోషనల్ అవుతుంది. ఆరు.
దీంతో నీ పూర్వ జన్మలో చేసిన పుణ్యములు ఈ జన్మలో చేసిన మంచి పనులు అంతకు మించిన నీ మంచి మనసు వలనే నీకీ భాగ్యము కలిగినది బాలిక అంటూ గుప్త చెప్పగానే.. గుప్త గారు నాకోసం మా వాళ్లు హోమం చేశారు కదా..? ఇక నా అసలు రూపం వస్తుందా..? అని అడుగుతుంది ఆరు. ఆవశ్యము బాలిక తప్పకుండా వచ్చును కానీ ఈరోజు కాదు అని చెప్పగానే.. మరి ఏ రోజు వస్తుంది అని ఆరు అడగ్గానే.. రేపు వినాయక చవితి కదా అన్ని విఘ్నములను తొలగించు ఆ వినాయకుడు నీ అసలు రూపము ఇచ్చును అని చెప్పగానే.. అంటే రేపు తప్పకుండా వస్తుంది కదా అంటుంది ఆరు. ఆవశ్యము వచ్చును బాలిక కానీ రేపి వరకు నీవు అప్రమత్తంగా ఉండవలెను.. ఎందువలన అనిని ఏ క్షణమైనను ఆ చంభా నిన్ను బంధించుటకు వచ్చును నీవు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నను.. ఆ దుష్ట మాంత్రికురాలు నిన్ను బంధించును అని చెప్తాడు.
ఇంతలో చిత్ర గుప్తుడు ఆరును వెతుకుతూ బాలిక అంటూ పిలుస్తూ వస్తుంటాడు. ఇంతలో ఆరు.. గుప్త గారు ఇక నాకేం పర్వాలేదు. నాకోసం మా ఆయన, నా చెల్లెలు, పిల్లలు హోమం చేశారు. రేపు వినాయక చవితి కూడా చేస్తారు. నాకు తోడుగా మీరు కూడా ఉన్నారు అంటుంది. ఇంతలో ఆరును గమనించిన చిత్రగుప్తుడు ఈ బాలిక ఎవరితోనో సంభాషిస్తున్నది.. అంటూ తుమ్మెద రూపంలో ఉన్న గుప్తను చూసి ఏయ్ భ్రమరమా ఆగుము అంటూ పట్టుకోబోతాడు. గుప్త తప్పించుకుని వెళ్లిపోతాడు. ఇంతలో ఆరు మిస్టర్ గుప్త ఎంతసేపని నుంచుంటారు. కూర్చోండి అంటుంది. బాలిక ఆ భ్రమరము ఎవరు అని అడుగుతాడు గుప్త. ఎవరు అంటూ తుమ్మెద అని చెప్తుంది ఆరు.
నువ్వు ఇంతసేపు ఆ భ్రమరముతోనే సంభాషిస్తుంటివా..? అని అడుగుతాడు. అవును ఇప్పుడు నాకున్న పర్సనాలిటీకి ఈగలతో దోమలతో తప్పా ఇంకెవరితో మాట్లాడలేను కదా మిస్టర్ గుప్త అని ఆరు చెప్తుంది. నాకెందుకో ఆ భ్రమరము మా విచిత్రగుప్తుడేమోనని సందేహంగా ఉన్నది అంటాడు గుప్త. దీతో ఏమీ తెలియనట్టు మా గుప్తగారా..? ఆయన్ని మీరే కదా పైకి పంపించారు మళ్లీ ఎలా వస్తారు అని అడుగుతుంది ఆరు. ఏ రూపంలో అయినా వచ్చే అవకాశం మాకు ఉన్నది కదా బాలిక అని చెప్తాడు. దీంతో ఆరు అవునులేండి మీరు ఏ రూపంలోనైనా వస్తారు.. ఎన్ని రోజులైనా పని చేస్తారు. మమ్మల్ని మాత్రం మధ్యలో తీసుకెళ్లిపోతారు. మీకసలు మనఃసాక్షే లేదు అంటూ తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం