BigTV English

Heavy Rains: రాష్ట్రంలో కుమ్మేస్తున్న వర్షం.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

Heavy Rains: రాష్ట్రంలో కుమ్మేస్తున్న వర్షం.. ఈ జిల్లాల్లో  ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థవెల్లడించింది. పండుగ సీజన్ కావడంతో, ముఖ్యంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక సూచనలు జారీ చేసింది. వర్షం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది.


ఏపీలో కుమ్మేస్తున్న వర్షం..
ఏపీలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురవడం వల్ల అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీటితో నిండిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది. మత్స్యకారులు సముద్రానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. అవసరం లేకుండా బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.

రానున్న రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు..
వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం, అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని, రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. మిగత ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అంతేకాకుండా ఎగువ రాష్ట్రాల్లో, ఏపీలో కురుస్తున్న భారీవర్షాలతో వివిధ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు


తెలంగాణలో వాతావరణ ఇలా..
తెలంగాణలో మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, జనగాం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

కుండపోత వర్షాలపై సీఎం రేవంత్ ఉన్నతాధికారులతో రివ్యూ..
భారీ వర్షాల హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కుండపోత వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన, పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని వెంటనే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఫైర్, పోలీసు బృందాలు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశం..
హైదరాబాద్ నగరంలో హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, పోలీసు బృందాలు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్‌కో సిబ్బందికి సూచించారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు వంతెనల వద్ద ప్రవాహం ఎక్కువగా ఉంటే రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని చెప్పారు.

వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు దిశానిర్దేశం
చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు దిశానిర్దేశం చేశారు.

రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
అయితే భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరి కొన్నింటిని దారిమళ్లించింది. నిన్న కరీంనగర్‌-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్‌, కాచిగూడ- మెదక్‌, మెదక్‌-కాచిగూడ, బోధన్‌-కాచిగూడ, ఆదిలాబాద్‌ – తిరుపతి రైళ్లు రద్దు చేశారు. ఇవాళ నిజామాబాద్‌ – కాచిగూడ సర్వీసును రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ – కాచిగూడ, షాద్‌నగర్‌ కాచిగూడ సర్వీసును పాక్షింగా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. కామారెడ్డి – బికనూర్ – తలమడ్ల, అకన్పేట్ – మెదక్ రైల్వే ట్రాక్‌ పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏ ర్పడింది. రైళ్ల రద్దు, దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రైళ్ల రద్దుకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Related News

AP Politics: సినిమాలకు గుడ్ భై..! పవన్ ప్లాన్ ఇదేనా..?

AP rainfall alert: ఏపీలో మళ్లీ వానల దాడి.. తీర ప్రాంతాలకి అలర్ట్!

Indrakiladri temple: విజయవాడ దుర్గమ్మ భక్తులకు షాక్.. కొత్త రూల్ పాటించాల్సిందే!

AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. గణేష్ మండపాల కమిటీ సభ్యులకు కీలక ప్రకటన జారీ!

Fire accident: వినాయక చవితి వేడుకల్లో అగ్నిబీభత్సం.. ప్రాణనష్టం తప్పి ఊపిరి పీల్చుకున్న భక్తులు.. ఎక్కడంటే?

Big Stories

×