PM SVANidhi Scheme: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల పథకాలు తీసుకొచ్చింది. అందులో వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం స్వనిధి. దీనికి గడువు ముగియడంతో మరోసారి పొడిగించింది ప్రభుత్వం. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ మరో ఐదేళ్లు అంటే 2030 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. చిరు వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పథకాన్ని తీసుకొచ్చింది. పట్టణ-గృహ నిర్మాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ పథకాన్ని మరోసారి పొడిగిస్తూ 2030, మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. వీధుల్లో తోపుడుబండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం.
పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి కింద ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. దీనివల్ల ఎలాంటి తనఖా లేకుండా అర్హత కలిగిన వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. తొలి ఏడాది 15 వేలు రుణం తీసుకోవచ్చు. అయితే తీసుకున్న నిధులను ఆ ఏడాదిలో చెల్లించాలి. రెండో ఏడాది 25000 కాగా, మూడో ఏడాది 50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.
గతంలో 10 వేలు, 20 వేలు వరకు ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం వల్ల కోటి మందికి పైగానే ప్రయోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు లోన్ ఇవ్వనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వడ్డీకి డబ్బులు తీసుకుని వ్యాపారం చేయడం కంటే ప్రభుత్వం లోన్ ఇప్పిస్తుందన్నమాట.
ALSO READ: 8 గంటలపాటు గచ్చిరోలిలో ఎన్‌కౌంటర్, నలుగురు మృతి
ఇప్పటి వరకు రూ.7332 కోట్ల మందికి లోన్ మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తొలి రెండో విడతల్లో తీసుకున్న రుణాన్నిచెల్లించిన వారికి యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డు ఇవ్వనుంది. రిటైల్, వోల్‌సేల్ ట్రాన్సాక్షన్లపై రూ.1600 వరకు డిజిటల్ క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.
లోన్ కోసం అప్లై ఎలా?
పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్ కావాలనుకునేవారు నేరుగా పీఎం స్వనిధి వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. లోన్ అప్లై చేయు విధానం Step by Step ఉంటుంది. తర్వాత కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. పది వేలు, రూ.20 వేలు, 50 వేలు వంటి ఆప్షన్లు ఉంటాయి. ఎంచుకున్న తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది.
అందులో ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాన్ని ఓకే చేసిన తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత వెండర్ ఐడీ కార్డు కావాల్సి వస్తుంది. మరో విషయం ఏంటంటే.. 10 వేల లోన్ తీసుకొని చెల్లించిన వారికే రూ.20 వేల లోన్ తీసుకోవడం వీలవుతుంది. స్ట్రీట్ ఫుడ్, గుడ్లు విక్రయించేవారు, ఫ్రూట్స్ సెల్లర్లు, కూరగాయలు అమ్మేవారు, బార్బర్ షాప్ తదితర వీధి వ్యాపారులు ఈ తరహా రుణాల కోసం అప్లై చేసుకోవచ్చు.
పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్ తీసుకున్నవారు ఇచ్చిన సమయానికి లోన్ మొత్తాన్ని చెల్లించాలి. వారికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్ల ద్వారా చెల్లింపులు చేస్తే ఏడాదిలో రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. వడ్డీ రాయితీ-క్యాష్‌బ్యాక్ రెండు కలిపి రూ.10 వేల రుణంపై రూ.1602 వరకు ప్రయోజనం పొందవచ్చు.