BigTV English

Gv Prakash: జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం అతనేనా..? అస్సలు ఊహించి ఉండరు..

Gv Prakash: జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం అతనేనా..? అస్సలు ఊహించి ఉండరు..

Gv Prakash: కోలీవుడ్ స్టార్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ( Gv Prakash ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో కూడా.. ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూనే మరోవైపు హీరోగా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన కెరియర్ పరంగా మంచి సక్సెస్ ని అందుకున్నారు కానీ ఈ మధ్య మాత్రం ఈయన పర్సనల్ లైఫ్ గురించి ఏదో ఒక వార్త వార్తలో హైలైట్ అవుతు వస్తుంది. ఆయన తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవి ప్రకాష్ గురించి ఎవరికీ తెలియని నిజం ఒకటి ఇప్పుడు బయటపడింది. అయితే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం ఓ స్టార్ క్రికెటర్ అని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఆయన వల్లే మ్యూజిక్ ని వదల్లేదు అంటూ జీవి ఓ సందర్భంలో చెప్పినట్లు సమాచారం.. క్రికెటర్ ఎవరు? ఆయన ఏమన్నారు ఇప్పుడు తెలుసుకుందాం..


జీవి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం ఆయనే..? 

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీనటులు లేదా టెక్నీషియన్లు ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఒకరు అంటూ పలు సందర్భాల్లో బయటపెట్టారు. చాలామంది ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ వల్లే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయాన్ని తమ ఇంటర్వ్యూల ద్వారా బయటపెడుతున్నారు. తాజాగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి సచిన్ టెండూల్కరే కారణం. చిన్నప్పుడు అతను సచిన్ వీరాభిమాని. క్రికెట్ చూస్తూ ఉండేవాడు. ఆ సమయంలో సచిన్, తన ఫ్రీ టైమ్‌లో ఏ.ఆర్. రెహమాన్ పాటలు మాత్రమే వింటాడని ఓ ఆర్టికల్ చదివాను.. తన కొడుకుకి ఈ విషయం చెప్తే సచిన్ మాత్రమే కాదు చాలామంది రెహమాన్ గారికి అభిమానులే అని చెప్పారట. తాను కూడా మెల్లగా మ్యూజిక్ వైపు ఆసక్తిని పెంచుకున్నారు. అలా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.


జీవి ప్రకాష్ కెరీర్ విషయానికొస్తే.. 

ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఈయనకు స్వయానా చెల్లెలు. రెహానా కొడుకు జీ. వీ. ప్రకాశ్ కుమార్, తమిళ్, తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో ఇప్పటికే 98 సినిమాలకు సంగీతం అందించాడు. జీ.వీ. ప్రకాశ్ 99వ సినిమాగా ధనుష్ ‘ఇడ్లీ కడాయి’, 100వ సినిమాగా శివకార్తికేయన్ ‘పరాశక్తి’ రిలీజ్ కాబోతున్నాయి. ఏడాది వచ్చినా అమరన్, అలాగే తెలుగులో లక్కీ భాస్కర్ సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఈ ఏడాది మరో రెండు మూడు సినిమాలు తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. హీరో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఓ హీరోయిన్ తో కలిసి డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు కూడా గతంలో వినిపించాయి. ఆమె మరెవరో కాదు హీరోయిన్ దివ్యభారతి. జీవీ ప్రకాష్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన ఫస్ట్ మూవీ బ్యాచిలర్.. ఈమధ్య వేద్దరిది మరో సినిమా కూడా వచ్చింది..

Related News

Suresh Gopi: మళ్లీ సినిమాలు చేస్తానంటున్న సురేష్.. కేంద్ర పదవికి రాజీనామా?

Sankranthiki vastunnam Remake: బాలీవుడ్ లోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ..హీరో ఆయనే..?

Senior heroines: సీనియర్ హీరోయిన్స్ కి కలిసిరాని రీఎంట్రీ.. మరి కామ్నా సంగతేంటి?

Siddu Jonnalagadda : తెలుసు కదా ట్రైలర్ కు ఎలివేషన్స్. నాగ వంశీ, సుమ ఆసక్తికర ట్విట్స్

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Big Stories

×