Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సచిన్ టెండూల్కర్ తరువాత మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే..? అది విరాట్ కోహ్లీ అనే చెప్పవచ్చు. కోహ్లీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందని తెలిసిందే. ఇటీవలే టీ-20, టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు ఈ ఆటగాడు. కేవలం వన్డే క్రికెట్ కి మాత్రమే పరిమితమయ్యాడు. అయితే తాజాగా కోహ్లీకి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఏబీ డివిలీయర్స్ కి సంబంధించిన క్యాచ్ ను అద్భుతంగా అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టిన సందర్భంలో ఓ సంచలన సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read : RCB Jersey : కోహ్లీ పరువు పాయే… కుక్కకు RCB జెర్సీ వేసి దారుణం
డివిలియర్స్ ని బండబూతులు తిట్టిన కోహ్లీ..
వాస్తవానికి డివిలియర్స్ అప్పటికే 52 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. హర్భజన్ సింగ్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద డివిలియర్స్ క్యాచ్ ను అందుకున్నాడు కోహ్లీ. ఈ సందర్భంలో డివిలియర్స్ ఔట్ కాగానే తన తల్లిని పచ్చిబూతులు తిట్టాడు విరాట్ కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ తరువాత వీరిద్దరూ కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడారు. ఐపీఎల్ 2025 సీజన్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు డివిలియర్స్ ఇండియాకి వచ్చేశాడు. మరోవైపు ఆర్సీబీ కి మళ్లీ ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవలే ప్రకటించాడు డివిలియర్స్. కోచ్ గా లేదా మెంటార్ గా ఆర్సీబీ తరపున వహిస్తానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి విరాట్ కోహ్లీ అప్పట్లో తిట్టిన బండ బూతులు ప్రస్తుతం వైరల్ కావడం విశేషం.
డివిలియర్స్ ని పొగిడిన కోహ్లీ..
మరోవైపు గత ఏడాది సౌతాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2024లో చోటు సంపాదించాడు. దిగ్గజ క్రికెటర్ డివిలియర్స్ ని అభినందిస్తూ మాజీ సహచరుుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ లేఖ కూడా రాశాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో డివిలియర్స్ చేరడం తనకు ఎంతో గౌరవంగా అనిపించిందని వెల్లడించాడు కోహ్లీ. విరాట్ కోహ్లీ- డివిలియర్స్ కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడారు. అయితే ఐపీఎల్ లో 2016లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సునీల్ నరైన్ బౌలింగ్ లో డివిలియర్స్ 94 మీటర్ల సిక్స్ ను బాదాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న కోహ్లీ.. డివిలియర్స్ సింగిల్ తీసి తనకు బ్యాటింగ్ ఇస్తాడని భావించాడు. కానీ డివిలియర్స్ భారీ షాట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైదానంలో ఇలాంటి ఊహించని విన్యాసాలు చేయడం డివిలియర్స్ కి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు.
?igsh=bmJyaGRqMTB0dDQz