Gadchiroli Encounter: 2025 ఏడాది మావోయిస్టులకు ఊహించని దెబ్బ తగిలింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీ చోట కీలకనేతలు మృతి చెందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోలు-బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోలు మరణించారు.
గడ్చిరోలి-నారాయణపూర్ సరిహద్దు ప్రాంతం కోపర్షి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు-భద్రతా దళాలకు దాదాపు ఎనిమిది గంటలపాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కీలకమైన నేతలుగా అంచనా వేస్తున్నారు పోలీసులు.
ఆగస్టు 25న ఆ ప్రాంతంలో గట్టా దళానికి చెందిన మావోలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందించింది. రెండురోజుల పాటు కమాండో యూనిట్లు-క్విక్ యాక్షన్ టీమ్స్-సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడే మకాం వేసి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. వర్షాలు పడుతున్నా భద్రతా దళాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగించారు. తొలుత మావోల నుంచి ఫైరింగ్ మొదలైంది.
భద్రతా దళాలపై కాల్పులు మొదలుకావడంతో వెంటనే స్పందించాయి. రెండు వర్గాల మధ్య దాదాపు 8 గంటల పాటు కాల్పులు జరిగినట్టు బలగాలు చెబుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనాస్థలం నుంచి నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.
ALSO READ: ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. పొంగిన రావి, బియాస్ నదులు
ఇంకా మావోలు ఉండవచ్చన్న సమాచారం ఆ ప్రాంతంలో కూంబింగ్ మొదలుపెట్టారు. ఇటీవల మావోల ప్రభావిత ప్రాంతాలలో భద్రతా దళాలు వారికి వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గడిచిన 18 నెలల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన పలు ఆపరేషన్లలో దాదాపు 450 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టాయి బలగాలు.
వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ నుండి మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాని అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి బలగాయి. రాష్ట్రాల సమన్వయంతో బలగాలు జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ కీలకమైన ప్రాంతాలపై కన్నేశారు.