E-Paper
Advertisement

MLA Yennam: నువ్వు ముక్కు నేలకు రాసినా.. కల్వకుంట్ల కుటుంబం నీకు ఏ పదవి ఇవ్వదు హరీష్‌రావు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

MLA Yennam: నువ్వు ముక్కు నేలకు రాసినా.. కల్వకుంట్ల కుటుంబం నీకు ఏ పదవి ఇవ్వదు హరీష్‌రావు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Advertisement

MLA Srinivas Reddy Comments on KTR and Harishrao: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న మహిళలకు ఫ్రీ బస్సు జర్నీకి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

‘కేసీఆర్ ఫాం హౌస్ లో కూర్చొని కొత్త వేషంలో ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు బరితెగించి కాంగ్రెస్ ఏ మంచి పని చేసినా విషం చిమ్ముతున్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు అర్ధం అవుతుంది. హరీష్ రావు దేవుడి పేరుతో దైవద్రోహం అని విమర్శిస్తున్నారు. 8 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేశాం. అపరిచితుడు సినిమాలో ఉండే శిక్షలు.. నరకంలో ఉండే శిక్షలు కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు పడాలి.

Advertisement

తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకు తిన్న మీరు.. దేవుడి పేరు తీసుకోవడం విడ్డూరం. కేటీఆర్ మహిళల మీద అనుచిత వాఖ్యలు చేస్తున్నారు.. నీకు ఏం సంస్కారం నేర్పారు. కేటీఆర్ ఆంధ్రలో చదువుకుంటే.. ఆ సంస్కృతి అయిన రికార్డింగ్ డ్యాన్సులు వంటపట్టయా. రికార్డింగ్ డాన్స్ లు తెలంగాణ సంస్కృతి కాదు.. కేటీఆర్. కేటీఆర్, హరీష్ రావు లు సిరిసిల్ల, సిద్దిపేటలో కాకుండా బయటకు వచ్చి పోటీ చేస్తే తెలుస్తుంది.

హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి అన్నీ అవినీతి ప్రాజెక్టులు కట్టారు. పదేళ్లలో తెలంగాణ రూ. లక్షా ముప్పైవేల కోట్ల అప్పులు రైప్మెంట్ చేయాలి. ఇంకా విమర్శలు చేస్తున్నారు అంటే..మీ ఒంట్లో సిగ్గు శరం లేదు. మీ విధ్వంసకర పాలన నుంచి.. తెలంగాణ విముక్తి అయ్యింది. తెలంగాణకు దిష్టి చుక్కలుగా కేటీఆర్, హరీష్ రావులు మిగిలిపోయారు. కాగ్నిజెంట్ శంకుస్థాపన ఎలా సాధ్యం అని కేటీఆర్ విమర్శిస్తున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి చూసి పెట్టుబడులు పెట్టేందుకు.. శంకుస్థాపనలు చేశారు. మీరు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని తెలిసి వారు వెనకడుగు వేశారు. మీ క్రెడిబిలిటీ ఏంటి అనేది వాళ్లకు అర్ధం అయ్యింది.

Advertisement

Also Read: కవితకు రాజ్యసభ పదవి.. : కేంద్రమంత్రి బండి సంజయ్

రేవంత్ రెడ్డి సోదరులు పాలన చేస్తున్నారు అనడానికి సిగ్గు ఉండాలి. రేవంత్ రెడ్డి తన సోదరులకు రాజ్యసభ ఇచ్చాడా..? కాంట్రాక్టులు ఇచ్చారా..? ఏం చేశారు..?? అలాంటి దగుల్బాజీ పనులు చేసింది మీరు. రేవంత్ రెడ్డి సోదరుడు బీజేపీలో యువ మోర్చాగా పని చేశారు. తిరుపతి రెడ్డి కూడా బీజేపీలో కీలకంగా గతంలో పని చేశారు. మీలాగా ప్యారాషూట్ వేసుకొని రాలేదు. దరిద్రం అయిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు.. కాస్త ఓపిక పట్టండి. కాంగ్రెస్ తప్పిదాలు చేస్తే.. ఎండగట్టిండి. మీ రాజకీయ బొంద మీరే పెట్టుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేలకు మీ మీదే నమ్మకం లేదు. హరీష్ రావు ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోవాలి అని రోజు హంగామా చేస్తున్నారు. నువ్వు ముక్కు నేలకు రాసిన.. కల్వకుంట్ల కుటుంబం నీకు ఏ పదవి ఇవ్వదు హరీష్ రావు. కష్టపడే నాయకుడు అనే కొంత పేరు ఉంది.. దానిని కాపాడుకుంటే రాజకీయ భవిష్యత్ ఉంటుంది. తెలంగాణ విధ్వంసానికి నువ్వు కూడా కారణం హరీష్ రావు. అందుకే కొంత కాలం సైలెంట్ గా ఉండి.. తప్పులు సరిదిద్దుకో’ అంటూ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యాక్తం చేశారు.

Related News

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

నవంబర్ లోగా కాఫర్ డ్యామ్ కట్టాల్సిందే.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచుతాం: కవిత

రెండు పెన్నులతో రాస్తారా.. మేము తీసుకోం పో..?

ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ కార్డుదారులకు కొత్త సరుకులు.. మంత్రి క్లారటీ!

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?

దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!

Big Stories

Advertisement
×