E-Paper
Advertisement

Harish Shankar: ఆ నటి నా భార్య కాదు.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

Harish Shankar: ఆ నటి నా భార్య కాదు.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Advertisement

Harish Shankar: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ననే హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకున్న విషయం తెల్సిందే. సేమ్ హరీష్ శంకర్ రొట్ట కొట్టుడు అని, మాస్ మహారాజా రవితేజ నటన కోసం చూడొచ్చు కానీ, కథ ఏమి లేదని, హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ అంతగా నచ్చలేదని పెదవి విరుస్తున్నారు.

ఇక ఇవేమి పట్టించుకోని హరీష్ శంకర్.. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు. ఇకపోతే గత కొన్నిరోజులుగా హరీష్ శంకర్ భార్య గురించి వస్తున్న రూమర్స్ పై ఎట్టకేలకు హరీష్ శంకర్ స్పందించాడు. హరీష్ శంకర్- రవితేజ కాంబోలో వచ్చిన మిరపకాయ్ చిత్రం గుర్తుందా.. ? అందులో హీరోయిన్ ఫ్రెండ్ గా ఒక అమ్మాయి కనిపిస్తుంది. బేస్ వాయిస్ తో రవితేజను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది. ఆమెనే స్నిగ్ధ. ముఖ్యంగా హీరోయిన్ తో.. సెకండ్ హీరోయిన్ గురించి చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది స్నిగ్ధ.

Advertisement

అదేంటంటే.. తప్పేముందిలేవే.. ఆ అమ్మాయిని చూసావా.. ఎలా ఉంటుందో తంగిడి కబాబ్ లా ఉంటుంది. అమ్మాయిని నాకే అదోలా ఉంటుంది దాన్ని చూస్తే అనే చెప్పే డైలాగ్ అదిరిపోతోంది. ఇక ఆ స్నిగ్దానే హరీష్ శంకర్ వైఫ్ అంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్త వినగానే అభిమానులు షాక్ అయ్యారు. ఏంటి.. నిజమా.. ? అని ఆశ్చర్యపోయారు.

ఇక ఈ విషయమై హరీష్ మాట్లాడుతూ.. తాను తన భార్య కాదని చెప్పుకొచ్చాడు. ” సోషల్ మీడియాలో నా భార్య అంటూ స్నిగ్ధ ఫోటో వేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. స్నిగ్ధ నా భార్య కాదు. నా భార్య పేరు కూడా స్నిగ్ధనే. అందుకే ఇద్దరు ఒకటి అనుకుంటున్నారు. మిరపకాయ్ లో నటించిన స్నిగ్ధ ప్రస్తుతం విదేశాల్లో ఉంటుంది. నా సినిమాలో మరోసారి నటిస్తావా అంటే.. రాను అని చెప్పింది. ఇలాంటి రూమర్స్ నా భార్య అస్సలు పట్టించుకోదు.

Advertisement

హీరోయిన్స్ విషయంలో నా సెలక్షన్ పై నా వైఫ్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది. మీకు మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్తుంది కానీ, జెలసీగా ఫీల్ అవ్వదు ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక స్నిగ్ద, హరీష్ శంకర్ భార్య కాదు అని తెలియడంతో ఆమె ఏం చేస్తుందో అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×