BigTV English

Runaway Bride: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

Runaway Bride: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

Runaway Bride| పెళ్లి అనగానే అందరూ ఎన్నో కలలు కంటుంటారు. జీవితంలో ఎంతో ఆశగా అందరూ వివాహం చేసుకుంటారు. తన జీవితంలో రాబోయే లైఫ్ పార్టనర్ తనన ఎంతో ప్రేమించాలనుకుంటారు. కానీ కొందరికి వివాహం ఒక పీడకలలా మారిపోతుంది. అలాంటిదే ఒక ఘటన బిహార్ లో జరిగింది. పెళ్లి అయిన కొన్ని రోజులకే ఆ పెళ్లికూతురు ఎవరికీ తెలియకుండా తన ప్రియుడికి రహస్యంగా కాల్ చేసేంది. భర్త రాగానే ఆమె ఫోన్ కట్ చేసేది. అడిగితే తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నానని చెప్పేది. అయితే ఒక రోజు ఆమె మాట్లాడుతుండగా ఆమె భర్త వెనుకనుంచి వచ్చి వినేశాడు. అంతే ఆ తరువాత అనుకోనిది జరిగింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని దర్భంగా జిల్లాలో జరిగింది.


Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

వివరాల్లోకి వెళితే.. దర్భంగా జిల్లాకు చెందిన రవికిషన్ అనే వ్యక్తి.. మధుబని నగరానికి చెందిన కవిత (23, పేరు మార్చబడినది) అనే యువతితో జూలై నెలలో పెళ్లి చేసుకున్నాడు. వివాహం తరువాత 10 రోజుల వరకు అంతా బాగానే ఉంది. కవిత కూడా ఇంట్లో అందరితో కలిసిపోయింది. తన భర్తతో సంతోషంగా ఉండేది. అయితే తరుచూ ఆమె తన గదిలోపలికి వెళ్లి లాక్ చేసుకునేది. లోపల అంత సేపు చేస్తున్నావ్? అని అడిగితే.. ఏమీ చెప్పేది కాదు. ఒకరోజు రవి కిషన్ ఇంటికి చాలా అలసిపోయి వచ్చాడు. ఆ సమయంలో కవిత..గది తలుపులు లోపలి నుంచి లాక్ చేసుకోకుండా ఫోన్ లో మాట్లాడుతోంది. భర్త రాగానే ఆమె ఫోన్ కట్ చేసింది. రవికిషన్.. ‘ఏమైంది? కంగారుగా ఉన్నావ్?’ అని అడిగాడు. దానికి కవిత ‘ఏం లేదు.. మా అమ్మానాన్నతో మాట్లాడుతున్నాను’. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కవిత ముఖం చూసి రవికిషన్ కు అనుమానం వచ్చింది. తన భార్యకు ఏదో ప్రాబ్లెమ్ ఉందని భావించాడు.


Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!

మరుసటి రోజు మళ్లీ రవికిషన్ వచ్చినప్పుడు.. కవిత ఫోన్ లో మాట్లాడుతోంది. ఈ సారి రవి ఆమె మాటలు వినాలని మెల్లగా ఆమె వెనుక నిలబడి విషయం విన్నాడు. అంతే అతని లోకం తలకిందులైంది. తన భార్య మరొక పురుషుడిని ప్రేమిస్తోందని అతనికి తెలిసింది. రవికిషన్ కు పట్టరాని కోపం వచ్చింది. కవిత చేతుల్లోంచి ఫోన్ లాక్కున్నాడు. అది చూసిన కవిత..భర్తకు విషయం తెలిసిపోయిందని భయపడిపోయింది. రవికిషన్ ఆమెపై ఎంతో కోపడ్డాడు. కానీ విషయం ఇంట్లో మరెవరికీ చెప్పలేదు. కవితను ఆమె ప్రియుడి గురించి వివరాలు చెప్పమని అడిగాడు. దాంతో కవిత తాను పెళ్లికి ముందే మరొక వ్యక్తిని ప్రేమించానని.. అయితే తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేశారని చెప్పింది. దాంతో రవి.. గతం గురించి ఆలోచించక తనతో జీవితం గడపాలని ఆమెతో అన్నాడు. దానికి కవిత కూడా అంగీకరించింది.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

ఈ ఘటన జరిగిన తరువాత కూడా కవిత ఇంట్లో అందరితో బాగానే ఉండేది. అయితే రెండు రోజుల క్రితం.. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో కవిత చడీచప్పుడు చేయకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఉదయం రవికిషన్ నిద్రలేచి చూడగా.. కవిత ఇంట్లో లేదు. ఆమె కోసం రోజంతా చాలా చోట్ల వెతికాడు. చివరికి కవిత తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాగా.. అతనికి మరో షాక్ తగిలింది. కవిత ఇంట్లో నుంచి బంగారు నగలు, డబ్బులన్నీ తీసుకొని వెళ్లిపోయిందని రవికిషన్ తల్లి చెప్పింది. దీంతో రవికిషన్ పోలీస్ స్టేషన్ వెళ్లి తన భార్య దొంగతనం చేసి పారిపోయిందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు అడిగితే.. ఆమె మధుబనిలో తన ప్రియుడు అమన్ మిశ్రా వద్దకు వెళ్లి ఉండవచ్చని అనుమానంతో చెప్పాడు. అయితే పోలీసులు మధుబని నగరానికి వెళ్లి చూడగా.. అమన్ మిశ్రా కూడా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని ఉన్న కవిత, ఆమె ప్రేమికుడి కోసం గాలిస్తున్నారు.

Related News

Rangareddy News: భార్య చెప్పడంతో సరే అన్నాడు.. ప్లాన్ చేసింది భార్య, సాయంత్రానికి

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Greater Noida: భార్యని సజీవ దహనం చేసిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి ఘాతుకం, ఎక్కడ?

Medchal News: గర్భవతి భార్యని చంపిన భర్త.. శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో, మేడ్చల్‌ జిల్లా దారుణం

Cyber fraud: 2 నెలల్లో 500 కోట్లు.. ఇదేం మోసం.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు!

Sahasra Murder Case: మా బిడ్డను హత్య చేసినట్టే వాడిని చంపేయాలి.. పీఎస్ ముందు కుటుంబ సభ్యుల నిరసన

Big Stories

×