BigTV English

Congress Party: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభ..

Congress Party: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభ..

Congress Party meeting


Telangana congress party news(Today news in Telangana): నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలపై ఈ మేరకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి కీలక సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనదారులు ఆంక్షలు పాటించాలని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు అమలు..


ఖమ్మం, నల్లగొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనదారులు పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ లేదా సర్వీసు రోడ్డు నుంచి బెంగుళూరు టోల్‌కు వెళ్లే మార్గంలో రావిర్యాల టోల్‌వద్ద ఎడమవైపు తిరిగి ఫ్యాబ్‌సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.

మాల్‌, ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్‌ హైవే, మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ బొంగుళూరు టోల్‌ నుంచి రావిర్యాల టోల్‌ వద్ద నుంచి ఫ్యాబ్‌ సిటీ వద్ద పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలని కోరారు.

జాతీయ రహదారి 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలంవద్ద పార్కింగ్‌కు చేరుకోవాలని సూచించారు.

జహీరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ నుంచి గచ్చిబౌలీ, శంషాబాద్‌ మీదుగా పెద్ద గోల్కొండ వద్ద కిందకు దిగి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలం వద్ద పార్కింగ్‌ చేసుకోవాలి.

వరంగల్‌ నుంచి వచ్చే వాహనాలు ఘట్కేసర్‌ ఓఆర్‌ఆర్‌ మీదుగా రావిర్యాల వద్ద కిందకు దిగి ఫ్యాబ్‌సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలపాలి. సిద్ధిపేట నుంచి వచ్చే వాహనాలు శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ మీదుగా ర్యావిర్యాలకు చేరుకొని ఫ్యాబ్‌ సిటీ వద్ద పార్కింగ్‌కు చేరుకోవాలి.

శ్రీశైలం వైపునకు వెళ్లే సాధారణ వాహనాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడమవైపు తిరిగి ఆగాఖాన్‌ అకాడమీ, విజయాడెయిరీ, గాంధీ బొమ్మ, రావిర్యాల, వండర్‌లా జంక్షన్‌, తిమ్మాపూర్‌, రాచులూరు నుంచి రాచులూరు గేటు మీదుగా వెళ్లాలి.

ఇక ఈ ఆంక్షలు సాయంత్రం 4 గంటల నుంచి మొదలుకుని రాత్రి 9 గంటల తరకు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×