E-Paper
Advertisement

Saturday Pooja: శనివారం నాడు శ్రీవారిని ఇలా పూజిస్తే… మీ అప్పుల బాధ మాయం

Saturday Pooja: శనివారం నాడు శ్రీవారిని ఇలా పూజిస్తే… మీ అప్పుల బాధ మాయం
Advertisement
Saturday Worship
Saturday Worship

Saturday Pooja: శనివారం అంటే చాలా మందికి ప్రత్యేక రోజు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ ఇష్ట దైవంగా ఏడుకొండల వాడు, శ్రీ వేకంటేశ్వర స్వామి వారినే ఎక్కువగా ఆరాధిస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఆపద వస్తే స్వామి గట్టెక్కిస్తాడని ప్రజల విశ్వాసం. అంతేకాదు శని దేవుడి ప్రభావం ఎల్లప్పుడూ తమపై పడకుండా ఉండాలని.. అటువంటి ప్రమాదాల నుండి తమను కాపాడాలని నిత్యం శ్రీవారికి సేవలు, పూజలు చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తే ఎటువంటి దోషాలు కూడా ఉండవని నమ్ముతారు. అయితే అసలు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తే సమస్యలు పోతాయనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఎలా పూజించాలో ఈ వార్తలో తెలుసుకుందాం.

శ్రీవారి చల్లని చూపు తమపై ఉంటే ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్థిల్లుతామని ప్రజల నమ్మకం. వెంకన్న కృప తమపై ఉంటే ఎటువంటి దోషాలు రావు. అలాగే శనిదోషం ఉన్నవారికి అది పోవాలన్న 8 శనివారాలు వ్రతం చేయాలని పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా మగవాళ్లు వరుసగా ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. ఇక ఆడవాళ్లు ఈ వ్రతం చేసే సమయంలో ఎటువంటి అడ్డంకుడు ఎదురైనా ఆ వారం మినహాయించి మిగిలిన వారాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: Time to worship God: దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది ?

8 శనివారాలు వ్రతం..

Advertisement

శనివారం వ్రతం ఎలా చేయాలో చాలా మందికి తెలిసి ఉండదు. శనివారం తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అనంతరం స్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి. అనంతరం వారి సంకల్పం స్వామి వారికి చెప్పుకోవాలి. అనంతరం స్వామి వారికి బియ్యం పిండి ప్రమిదలు చేయాలి. అది కూడా బియ్యం పిండిలో పాలు, బెల్లం ముక్క, అరటి పండు ముక్క వేసి చపాతి పిండిలా కలుపుకుని అనంతరం ప్రమిదలు చేయాలి. తయారు చేసిన ప్రమిదలో 7 ఒత్తులు వేసి స్వామి వారి ఫోటో ముందు పెట్టి దీపం వెలిగించాలి. ఇలా 8 శనివారాల పాటు స్వామి వారిని పూజిస్తే అన్ని దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు, అప్పుల బాధలు పోతాయని చెబుతున్నారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×