E-Paper
Advertisement

Rahul Gandhi: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత.. సాయంత్రం వరంగల్‌‌కు రాహుల్ రాక

Rahul Gandhi: తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత.. సాయంత్రం వరంగల్‌‌కు  రాహుల్ రాక
Advertisement

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రం ఐదున్నర గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి చాపర్‌లో వరంగల్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం సుప్రభ హోటల్‌లో కొంత సేపు విశ్రాంతి తీసుకోనున్నారు.

ఆ తర్వాత ట్రైన్ లో స్టూడెంట్స్‌తో ప్రొగ్రాంకు ఆయన హాజరవుతున్నారు. అనంతరం వరంగల్ నుంచి సాయంత్రం ఏడున్నర గంటలకు రైలులో తమిళనాడు వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. బీసీ కులగణన,ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల రియాక్షన్ తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అలాగే రైల్వేల ప్రయివేటీకరణ అంశంపై ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సడన్‌గా అగ్రనేత రావడంతో నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రెండు భారీ సభలు ఏర్పాటు చేస్తున్నామని రావాలని కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించారు మహేష్ కుమార్. బీసీ కులగణన సభకు రాహుల్‌గాంధీ, ఎస్పీ వర్గీకరణ అంశంపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రావాలని కోరినట్టు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్‌కుమార్ చెప్పిన విషయం తెల్సిందే.

Related News

భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!

చెడు చేసేవారికి ఎప్పటికీ విజయముండదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు

గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

Big Stories

Advertisement
×