Sanjay dutt:ఏ సెలబ్రిటీలైనా సరే కష్టం వచ్చింది అంటే అభిమానులను ఆదుకోవడానికి ముందుంటారు. కానీ ఇక్కడ ఒక అభిమాని మాత్రం ఏకంగా తనకు ఇష్టమైన నటుడి కోసం తన వద్ద ఉన్న రూ. 72 కోట్ల ఆస్తిని రాసి ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ స్టార్ నటుడు ఎవరు? ఆ అభిమాని ఎవరు? ఎందుకు తన ఆస్తిని ఈ నటుడి పేరు పైన రాశారు? మరి హీరో రియాక్షన్ ఏంటి? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నటుడి పేరుపైన రూ.72 కోట్ల ఆస్తిని రాసిన అభిమాని..
అసలు విషయంలోకెళితే.. ఒక వీరాభిమాని నిషా పాటిల్ (Nisha patil) చనిపోయే ముందు తన ఆస్తులను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay dutt) పేరుపై ఏకంగా రూ.72 కోట్లు రాసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం సంజయ్ దత్ కు తెలియడంతో ఆయన దీనిని తిరస్కరించారట.అంతేకాదు తనకు నిషా పాటిల్ తో ఎటువంటి పరిచయం లేదని, ఈ రూ.72 కోట్ల ఆస్తిని తాను క్లైమ్ చేసే ఆలోచనలో లేరని, సంజయ్ దత్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అభిమానుల పిచ్చి పరాకాష్టకు చేరింది అని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. పోయి పోయి సినిమా వాళ్లకు అన్ని డబ్బులు రాసి ఇవ్వడం ఎందుకు ఏదైనా అనాధాశ్రమానికి రాసి ఇవ్వొచ్చు కదా అంటూ నిషా పాటిల్ పై కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఇంత డబ్బు మాకు ఇచ్చిన బాగుండు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం ఏదిఏమైనా సంజయ్ దత్ పేరుపైన నిషా పాటిల్ అనే అభిమాని రాసిన ఈ ఆస్తుల వివరాలు సంచలనంగా మారాయి.
సంజయ్ దత్ కెరియర్..
సంజయ్ దత్ కెరియర్ విషయానికి వస్తే.. సంజయ్ దత్ ఎవరో కాదు ప్రముఖ నటీనటులు సునీల్ దత్ , నర్గీస్ దత్ ల కుమారుడు. ఈయన సోదరి ప్రియా దత్.. పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. ముంబై మహారాష్ట్రకు చెందిన ఈయన 1959 జూలై 29న జన్మించారు. 1987లో రిచా శర్మాను వివాహం చేసుకోగా.. 1996లో ఆమె బ్రెయిన్ ట్యూమర్ తో మరణించింది. వీరిద్దరికీ త్రిషాల అనే కూతురు జన్మించింది. ప్రస్తుతం ఈమె తన అమ్మమ్మ, తాతయ్య తో కలిసి అమెరికాలో ఉంటున్నారు..ఆ తర్వాత 1998లో రియా పిళ్ళై ను వివాహం చేసుకున్నారు. ఈమెతో 2005లో విడాకులు తీసుకున్నారు. ఇక 2008లో మాన్యత దత్ ను వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి 2010 లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. అబ్బాయ షహ్రాన్ , అమ్మాయి ఇక్రా అనే పిల్లలు ఉన్నారు.
సంజయ్ దత్ సినిమాలు..
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ది రాజా సాబ్” సినిమాలో నటిస్తున్నారు. అలాగే భాగీ -4 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే లియో, కేజిఎఫ్ 2 చిత్రాలలో విలన్ గా నటించి, భారీ పాపులారిటీ అందుకున్నారు ఇక ఈ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారని చెప్పవచ్చు.