Rhea Chakraborty: హీరో, హీరోయిన్లు ఎవరు ఏమన్నా చాలావరకు భరిస్తారు. వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడరు. వారిచ్చే రియాక్షన్స్‌కు ఆడియన్స్ నుండి రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఆలోచించి చాలావరకు సైలెంట్‌గా ఉంటారు. కానీ అవతలి వారి ప్రవర్తన శృతిమించినప్పుడు రియాక్ట్ అవ్వక తప్పదు. అలా ఇప్పటికే పలువురు నటీనటులు ఓపెన్‌గా ఆడియన్స్ మీద ఫైర్ అయ్యి వైరల్ అయ్యారు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా అదే కేటరిగిలో చేరింది. తను జడ్జిగా వ్యవహరిస్తున్న ఒక షోలో కంటెస్టెంట్ చేసిన పనికి రియాకి చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తనకు స్టేజ్‌పైనే వార్నింగ్ ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ఇలా జరిగిందేంటి.?
‘రోడీస్ డబుల్ ఎక్స్’ అనే రియాలిటీ షోకు రియా చక్రవర్తి (Rhea Chakraborty) హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ షోలో కంటెస్టెంట్స్‌గా వచ్చేవారి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అలా ప్రతీ ఎపిసోడ్ ట్విస్టులతో నిండిపోతోంది. ఇందులో గ్యాంగ్ లీడర్‌గా ఉన్న రియా.. తన కంటెస్టెంట్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఒక కంటెస్టెంట్ రిషబ్. తాజాగా రియాకు, రిషబ్‌కు మధ్య జరిగిన ఒక సంఘటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రిషబ్ కూడా కంటెస్టెంట్స్‌లో ఒకడు. అందుకే తనకు కూడా పలు ఛాలెంజ్‌లు ఇచ్చారు జడ్జిలు. అందులో బెల్లి డ్యాన్స్, ఫిట్‌నెస్‌తో రియా చక్రవర్తిని ఇంప్రెస్ చేయాలని కూడా ఉంది. దాంతో రిషబ్.. తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టాడు.
దెబ్బలు తింటావ్
రియా చక్రవర్తిని ఇంప్రెస్ చేసే క్రమంలో తన చేయి పట్టుకున్నాడు రిషబ్. అది రియాకు అస్సలు నచ్చలేదు. వెంటనే తన చేయి తీసేసి తనకు వార్నింగ్ ఇచ్చింది. ‘‘ఇదే పని బయట చేసుంటే నా చేతిలో దెబ్బలు తినేవాడివి’’ అంటూ సీరియస్ అయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఇంప్రెస్ చేసే క్రమంలో తన చేయి పట్టుకోవడం రియా చక్రవర్తికి అంతగా నచ్చలేదని క్లియర్‌గా అర్థమవుతోందని తెలుస్తోంది. తను చేసింది తప్పు అని తెలుసుకున్న రిషబ్.. వెంటనే రియాకు సారీ కూడా చెప్పాడు. వెంటనే ఆ విషయం అక్కడితో ముగిసిపోయింది. కానీ రిషబ్‌పై రియా సీరియస్ అయిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యింది.
Also Read: మా అమ్మ యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లలేదు.. ఆసక్తికర విషయం బయటపెట్టిన ఖుషి కపూర్
స్థానం దక్కింది
రియా చక్రవర్తితో అంత గొడవ జరిగినా కూడా ఇతర జడ్జిలను ఇంప్రెస్ చేసిన రిషబ్‌కు ఈ షోలో స్థానం లభించింది. రియా గ్యాంగ్‌లోనే తను సెలక్ట్ అయ్యాడు కూడా. ఇక త్వరలో ‘రోడీస్ డబుల్ ఎక్స్’లో రియా, రిషబ్ మధ్య ఇంకా ఎలాంటి మనస్పర్థలు చూడాలా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ‘రోడీస్’ అనే రియాలిటీ షోకు హిందీలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ షో సక్సెస్‌ఫుల్‌గా ఒక సీజన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో సీజన్ కోసం ఆడిషన్స్ మొదలయ్యాయి. అందులో ఒక గ్యాంగ్‌కు లీడర్‌గా రియా చక్రవర్తి వ్యవహరిస్తోంది. ఇందులో లీడర్‌గా, జడ్జిగా రియా ప్రవర్తన చాలామందిని ఆకట్టుకుంది.