BigTV English
Advertisement

NTR: ఎన్టీఆర్ అంత బిజీనా? తాత వేడుకకు కావాలనే డుమ్మా కొట్టారా?

NTR: ఎన్టీఆర్ అంత బిజీనా? తాత వేడుకకు కావాలనే డుమ్మా కొట్టారా?
jr ntr sr ntr

NTR: మాటకు ముందొక తాత. మాటకు తర్వాత ఓ తాత. నందమూరి తారక రామారావు పేరు ఎత్తకుండా మాట్లాడలేరు జూనియర్ ఎన్టీఆర్. తాతంటే అంతే ప్రేమ, అభిమానం కూడా. ఎన్టీఆర్ వల్లే తానకీ గుర్తింపని ఆయనెప్పుడూ అంటుంటారు. తాతంటే పడి చస్తారు. అలాంటిది.. ఆ పెద్ద ఎన్టీఆర్ శతజయంతి వేడుక అంత ఘనంగా నిర్వహిస్తుంటే.. జూనియర్ ఎన్టీఆర్ రాలేరా? తాను బిజీగా ఉన్నానంటూ.. డుమ్మా కొట్టడం ఎంత వరకు కరెక్ట్? పెద్ద పెద్ద వాళ్లే వస్తున్నారు.. ఈ బుడ్డోడు వస్తే తప్పేంటి? అనే విమర్శలు వస్తున్నాయి.


చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, కల్యాణ్ రామ్, అల్లు అర్జున్, రానా, రాఘవేంద్రరావు.. ఇలా చాలా మందే ప్రముఖులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వస్తామన్నారు. కానీ, జూనియర్ మాత్రం తాను రానని ముందే చెప్పాడు. ఏం.. వాళ్ల కంటే బిజీనా? అప్పుడే అంత పెద్దోడై పోయాడా? అంటున్నారు కొందరు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని.. మే 20న తన బర్త్ డే అని.. విదేశాలకు వెళ్లాడని.. ఇలా రీజన్స్ చెబుతున్నారు. కానీ, బర్త్ డే ప్రతీ ఏటా జరుపుకోవచ్చు.. ఎన్టీఆర్ శతజయంతి ఏటేటా రాదుగా? తాత వేడుక కోసం.. ఒక్క బర్త్ డే సెలబ్రేషన్‌ను త్యాగం చేయలేరా? అనే వాదన వినిపిస్తోంది.

అయితే, జూనియర్ ఎన్టీఆర్ కావాలనే ఈ ఈవెంట్‌కు డుమ్మా కొట్టారనే టాక్ కూడా ఉంది. చంద్రబాబుతో వేదిక పంచుకోవడం ఆయనకు ఇష్టం లేనట్టుంది. ఇటీవల టీడీపీ సభలు, రోడ్ షోలలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నినాదాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు పదే పదే ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. సెగ తగులుతోంది. పార్టీ శ్రేణులు, అభిమానులు.. ఎంతగా తారక్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నా.. చంద్రబాబు మాత్రం ప్రతీసారి వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్నారు. నారా లోకేశ్‌కు పోటీ అవుతారనే.. జూనియర్‌ను రాజకీయాల్లోకి రానివ్వడం లేదనే టాక్ అయితే ఉంది.


మరోవైపు, తారక్ సైతం తన పొలిటికల్ ఎంట్రీపై మౌనంగానే ఉంటున్నారు. ఆ టాపిక్ వద్దు బ్రదర్.. అంటూ ఫ్యాన్స్‌కు కాస్త గట్టిగానే చెబుతున్నారు. గతంలో పసుపు జెండా పట్టుకుని, ఖాకీ డ్రెస్ వేసుకుని.. టీడీపీకి ప్రచారం చేసినా.. పార్టీ ఓడిపోయిన చేదు అనుభవం ఆయన్ను వెంటాడుతోంది. రాజకీయాల్లోకి రావడానికి ఇది సరైన సమయం కాదని.. ముందు సినిమాలు.. తాతలా.. ఓ ఏజ్ వచ్చాకే రాజకీయాలు.. అని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అయితే, ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడే రావాలంటూ పట్టుబడుతున్నారు. టీడీపీ కష్టాల్లో ఉన్న ప్రతీసారి తెలుగు తమ్ముళ్లకు జూనియర్ ఎన్టీఆరే గుర్తొస్తుంటారు. అందుకే, రాజకీయ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరం ఉంటూ వస్తున్నారు తారక్. ప్రస్తుతం.. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుండటం.. తన పొలిటికల్ ఎంట్రీకి తగిన స్పేస్ కూడా లేకపోవడంతో.. ఫుల్ టైమ్ మూవీస్ పైనే ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే RRRతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. త్వరలోనే హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తారని అంటున్నారు. మరి, ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఆయనకు ఏముంది? ఇంతచిన్న లాజిక్ అభిమానులకే అర్థం కావట్లే.

సరే, రాజకీయాల్లోకి ఇప్పుడే రారనుకున్నా.. తాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకైనా రావొచ్చుగా? పెద్ద పెద్దోళ్లంతా వస్తున్నారు.. బుడ్డోడు వస్తే తప్పేంటి? ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోతే.. టీడీపీ కండువా కప్పేయరుగా? లేదంటే, చంద్రబాబుతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనా? తాత కంటే కుటుంబంతో బర్త్ డే వేడుకలే ఎక్కువ అనుకుంటున్నారా? ఏమో. తారక్‌కే తెలియాలి.

Related News

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

Big Stories

×