BigTV English

Sundar Pichai: ఇల్లు అమ్ముకున్న గూగుల్ సీఈవో తండ్రి.. ఈ పెద్దోళ్లున్నారే!

Sundar Pichai: ఇల్లు అమ్ముకున్న గూగుల్ సీఈవో తండ్రి.. ఈ పెద్దోళ్లున్నారే!
sunder pichai

Sundar Pichai: సుందర్ పిచాయ్. గూగుల్ సీఈవో. ఏడాదికి వందల కోట్ల శాలరీ. ఏం చేసుకోవాలో తెలీనంత డబ్బు. అమెరికాలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలా ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకునే వారిలో ఒకరు సుందర్ పిచాయ్ అయితే.. ఆయన తల్లిదండ్రులు మాత్రం చెన్నైలోనే సింపుల్ జీవితం గడిపేస్తున్నారు. కొడుకు ఎంత గొప్పవాడైనా.. తమకు మాత్రం పుట్టిన ప్రాంతంమే ముఖ్యం అంటూ.. ఇక్కడే ఉండిపోయారు. అలాంటి సుందర్ పిచాయ్ తండ్రి రాఘునాథ పిచాయ్ తాజాగా తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మేయడం ఆసక్తికరంగా మారింది. అందులోనూ, సుందర్ బాల్యమంతా ఆ ఇంట్లోనే గడవడం.. ఆ ఇంటితో అనేక జ్ఞాపకాలు ఉండటం.. అయినా, ఆ ఇంటిని ఇప్పుడు అమ్మేయడం టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచింది.


చెన్నైలోని అశోక్ నగర్‌లో ఉందా ఇల్లు. సుందర్ పిచాయ్ తండ్రి ఆ ఇంటిని అమ్ముతున్నారని తెలిసి.. తమిళ నటుడు, నిర్మాత మణికందన్ ఆ ఇంటిని కొనుక్కున్నాడు. ఇంటిని అమ్మేశాక.. ఆస్థి పత్రాలు ఇస్తూ రఘునాథ పిచాయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. కన్నీళ్లు సైతం పెట్టుకున్నారట. తాము మొదటి నివసించిన ఇంటిని చాలా సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యారట.

ఇక, సుందర్ పిచాయ్ తల్లిదండ్రుల ప్రవర్తన గురించి ఎంతో విశేషంగా చెబుతున్నారు మణికందన్. ఎంక్వైరీ కోసం వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారని చెప్పారు. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసులోనూ గంటల తరబడి వేచి ఉన్నారట రఘునందన్. తాను సుందర్ పిచాయ్ తండ్రినని ఎక్కడా చెప్పనివ్వలేదట. కొడుకు పేరు వాడుకోవడం ఇష్టం లేదన్నారట. ఇక, కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యాక.. ఇంటిని కూల్చేందుకు అయ్యే ఖర్చునూ ఆయనే చెల్లించారని చెబుతున్నారు. పన్నులేమీ పెండింగ్ లేకుండా పూర్తిగా చెల్లించేశారట.


సుందర్ పిచాయ్ మన దేశాన్ని గర్వపడేలా చేశారు.. అందుకే, ఆయన నివసించిన ఇంటి స్థలాన్ని కొనడం గర్వంగా ఉందటున్నారు నిర్మాత, నటుడు మణికందన్. ఆ స్థలంలో విల్లా నిర్మిస్తానని చెప్పారు.

ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంతకీ ఆ పాత ఇంటిని సుందర్ తండ్రి ఎందుకు అమ్ముకున్నట్టు? డబ్బుల కోసమా? కొడుకు దగ్గరే బోలెడంత ఉంది, అడిగితే ఇవ్వడా? పోనీ, పాత పడింది.. ఇక పనికి రాదని అమ్మేసుకున్నారా? అలాగైతే చాలామంది సంపన్నులు తాము మొదట్లో వాడిన స్కూటర్లు, చిన్ననాటి వస్తువులు సెంటిమెంట్‌గా, జ్ఞాపకంగా దాచుకుంటారు, అలానే ఆ ఇంటిని మెమోరిగా ఉంచుకోవచ్చుగా? సుందర్ పిచాయ్ తనకు 20 ఏళ్లు వచ్చే వరకు ఆ ఇంట్లోనే పెరిగాడు.. అలాంటి ఇంటిని ఇలా అడ్డగోలుగా అమ్మేసుకోవడం కరెక్టేనా? ఇంటిని మెయిన్‌టెన్ చేయలేనప్పుడు, కూల్చేసి స్థిరాస్థిగా అట్టిపెట్టేసుకోవచ్చుగా? ఏదైనా సామాజిక సంస్థకు డొనేట్ చేయొచ్చుగా? ప్రజాప్రయోజన కార్యానికి ఇవ్వొచ్చుగా? అంత బాధపడుతూ, కన్నీళ్లు పెడుతూ ఇంటి పత్రాలు ఇచ్చే బదులు.. అసలు ఆ ఇంటిని అమ్మకుండా ఉంటే బాగుండేదిగా? పోయేదేముంది వాళ్లకు? కనీసం కొడుకైనా తండ్రికి చెప్పలేకపోయాడా? అమ్మకుండా ఆపలేకపోయాడా? అందుకే అంటారు.. ఈ పెద్దోళ్లున్నారే!

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×