Police Complaint: ఉన్నతాధికారులు చెప్పేది చెబుతారు.. మేం చేసేది మేం చేస్తాం అన్నట్టుగా ఉంది కొంతమంది పోలీసుల వ్యవహారం. రోడ్డు ప్రమాద బాధితులు రెండు పెన్నులతో ఫిర్యాదు రాసి ఇస్తే తీసుకోం పో అంటూ వెనక్కి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్ పూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి శామీర్ పేట్ వైపు వెళుతున్న కారును సిమెంట్ రెడీమిక్స్ వాహనం ఢీకొట్టింది. కారులోని బెలూన్లు తెరుచుకోవటంతో అందులో ఉన్న ఇద్దరు స్వల్పగాయాలతో బతికి బయటపడ్డారు. కాగా, యాక్సిడెంట్ కాగానే బాధితులు 112 నెంబర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో జీనోమ్ వ్యాలీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని వారికి వివరంగా చెప్పిన బాధితులు అక్కడికక్కడే ఫిర్యాదు రాసి ఇచ్చారు. మొదట బ్లూ పెన్ తో ఫిర్యాదు రాయగా ఇంక్ అయిపోవంతో బ్లాక్ పెన్‌తో దానిని పూర్తి చేశారు. అయితే, రెండు రంగుల పెన్నులతో కంప్లయింట్ రాసిస్తే తీసుకోం అంటూ పోలీసులు వారికి చెప్పారు. స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇవ్వండని హుకూం జారీ చేశారు.
Also read: తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?