E-Paper
Advertisement

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల సమీక్ష కోసం కమిటీ ఏర్పాటు.. సభ్యులగా ఉన్నది వీరే..?
Advertisement

El Niño Committee: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో కరువు, ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించి, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రి సీతక్క సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 1523ను జారీ చేసింది.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మంత్రి సీతక్క అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సరఫరా, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

భవిష్యత్తులో..

తాగునీటి భద్రతతో పాటు జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కీలకంగా వ్యవహరిస్తోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు, పంట గుంతలు, ఊట కుంటల నిర్మాణం, నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోంది. నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భవిష్యత్తులో తాగునీటి కొరతను తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్యలను గుర్తించి పరిష్కరించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చూడటంలో శాఖ సమన్వయంతో పనిచేస్తోంది.

సబ్ కమిటీలో..

Advertisement

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చైర్మన్‌గా వ్యవహరించే ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రి సీతక్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు తదుపరి చర్యలపై ప్రభుత్వానికి సిఫారసులు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత.

Also read: దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!

Tags

Related News

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

నవంబర్ లోగా కాఫర్ డ్యామ్ కట్టాల్సిందే.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచుతాం: కవిత

రెండు పెన్నులతో రాస్తారా.. మేము తీసుకోం పో..?

ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ కార్డుదారులకు కొత్త సరుకులు.. మంత్రి క్లారటీ!

దసరా పండుగవేల షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన నిత్యావసర వస్ధువుల ధరలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరిన మన్నె క్రిశాంక్..!

ఫేక్ అకౌంట్లతో అలాంటి ఫోటోలు పంపించి.. లక్షలు దండుకున్న కిలాడీ అరెస్ట్!

Big Stories

Advertisement
×