E-Paper
Advertisement

CV Anand: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారు.. సజ్జనార్‌కి సీవీ ఆనంద్ అభినందనలు

CV Anand: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారు.. సజ్జనార్‌కి సీవీ ఆనంద్ అభినందనలు

CV Anand: ఐబొమ్మ (Ibomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను.. రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ డీ మూవీ పైరసీ కేస్ ప్రెస్ మీట్ వివరాలు మళ్లీ రిపోస్ట్ చేస్తున్నాను. హ్యాకర్లు డిజిటల్ కంపెనీస్ సర్వర్లు హ్యాక్ చేసి సనిమా విడుదలకు ముందే ఒరిజినల్ కాపీలను తమ వెబ్ సైట్లలో విడుదల చెయ్యటం వల్ల సినిమా పరిశ్రమకు భారీ నష్టాలు వచ్చాయని సీవీ అనంద్ పేర్కొన్నారు. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్ అని సివీ ఆనంద్ ట్వీట్ చేశారు.

కాగా ఐబొమ్మ  వెబ్ సైట్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన ఇమ్మడి రవిని.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్ పల్లిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కి రాగానే పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిడ్స్‌లో ఉంటూ.. రవి ఈ వెబ్ సైట్ నిర్వహిస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు. కేసు దర్యాప్తు కోసం రవీని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరినట్లుగా తెలుస్తోంది.

పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ఐబొమ్మ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు గత కొన్నేళ్లుగా.. దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం వాటినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పైరసీ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించిన రవీకి చెందిన రూ.3 కోట్ల బ్యాంకు ఖాతాలను పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. అంతేకాక రవీ ప్లాట్ నుండి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు అప్లోడ్ చేయడానికి సిద్దంగా ఉన్నా సినిమాల హెచ్‌డి ప్రింట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వ్యక్తిగత అంశం కూడా ఈ అరెస్టులో కీలకం అయింది. రవీకి తన భార్యతో విడాకుల విషయంలో ఇండియాకు వచ్చాడని, ఈ సమాచారం ద్వారానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పైరసీ కంటెంట్‌తో పాటు, వెబ్‌సైట్‌లో బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేయగా.. ప్రధాన వెబ్ సైట్లైన ఐబొమ్మ, బప్పం సైట్లను ఇప్పటికే బ్లాక్ చేశారు. మరో రెండు రోజుల పాటు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

ఏపీ తెలంగాణతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో కూడా ఐబొమ్మపై కేసు నమోదు అయ్యాయి. పైరసీ నిర్వాకం మొత్తం ఇతను ఒక్కడే చేస్తున్నాడా..? ఇతను వెనుక మరెవరైనా ఉన్నారా? నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది అన్న అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

Also Read: ఎమ్మెల్యే నవీ‌న్ యాదవ్‌‌కు బంపరాఫర్.. రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి?

తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐబొమ్మపై.. తెలుగు ఫింల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. గతంలోని వెబ్‌సైట్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో నిందితుల్ని అరెస్ట్ చేశారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×