E-Paper
Advertisement

Mahbubnagar: దారుణం.. తమ్ముడికి పెళ్లి చేశాడ‌ని క‌త్తితో పొడిచి..పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టి..

Mahbubnagar: దారుణం.. తమ్ముడికి పెళ్లి చేశాడ‌ని క‌త్తితో పొడిచి..పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టి..
Advertisement

Mahbubnagar: ఈ రోజుల్లో సొంత అన్నదమ్ముల్లా పొట్టు పొట్టు కొట్టుకుంటున్న కాలం ఇది. కానీ, ఈ అన్న మాత్రం తమ్ముడి కోసం ఎంత త్యాగం చేశాడు.. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపించేలా ఉంది ఈ ఘటన.. అసలు ఏం జరిగిందంటే.. ఇక్కడ తన తమ్ముడి ప్రేమకు అన్న బలైపోయాడు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో 3 రోజుల క్రితం కిడ్నాపైన కేసును ఛేదించిన పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్‌.. అదే గ్రామానికి చెందిన భవానిని ప్రేమించి అమ్మాయితో పరారయ్యాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరిదీ కులాలు వేరు అవడంతో పెళ్లి కూతురు తండ్రి ఈ విషయం విన్న తర్వాత తట్టుకోలేక పోయాడు.

Advertisement

దీంతో వాళ్ల అన్నే ఈ పెళ్లి చేశాడని ఆగ్రహంతో చంద్రశేఖర్ అన్న రాజశేఖర్‌ను అమ్మాయి తండ్రి కిడ్నాప్ చేశాడు. తన భర్త కనిపించడం లేదని రాజశేఖర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరిగ్గా 3 రోజుల తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నవాపేటలో రాజశేఖర్ మృతదేహం లభ్యమైంది. అక్కడ ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి ఎస్సీ వర్గానికి చెందిన వారు, హత్యకు పాల్పడింది అమ్మాయి తరపు బీసీ సామాజిక వర్గం వారు అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×