E-Paper
Advertisement

Rains : తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక..

Rains : తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక..
Advertisement

Rains: తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం నుంచి గురువారం వరకు చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. మంగళవారం నిజామాబాద్‌ , కామారెడ్డి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని పేర్కొంది.

Advertisement

బుధవారం ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తాయని ప్రకటించింది. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

మరోవైపు తెలంగాణలోని 9 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక పంపింది. ఆయా జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో జూన్‌లో సగటు వర్షపాతంతో పోల్చితే 60 శాతం నుంచి 77 శాతం తక్కువగా కురిసిందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఈ వానాకాల సీజన్‌లో పంటలకు నీటి కొరత ఏర్పడే ప్రమాదముందని వ్యవసాయశాఖ పేర్కొంది.

Related News

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

Big Stories

Advertisement
×