BigTV English

Gold Fancy Items : జడ పువ్వులు, పిన్నులు వెండి, బంగారానివే ఎందుకు వాడాలంటే…

Gold Fancy Items : జడ పువ్వులు, పిన్నులు వెండి, బంగారానివే ఎందుకు వాడాలంటే…
Gold Fancy Items


Gold Fancy Items : ఆధునిక జీవన విధానంలో వచ్చే మార్పులు మనల్ని ఒక్కోసారి లక్ష్మీకటాక్షానికి దూరం చేస్తుంటాయి . తెలియకుండానే తప్పులు చేయడం వల్ల ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. వ్రతాలకు తగిన ఫలితం లేదంటూ బాధపడినా లాభంలేదు. ముఖ్యంగా మహిళలు శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తలస్నానం చేసిన తర్వాత చేసే తప్పులు వారి పూజల్ని నిష్పలంగా మారుస్తున్నాయి. నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే ఐశ్వర్యం ఒక్కటే కాదు తృప్తి కూడా ముఖ్యమే. ఏదైనా అమ్మవారి అనుగ్రహం వల్లే సాధ్యమవుతాయి. మంచి ఆరోగ్యం కూడా అమ్మవారి దయ వల్లే కలుగుతుంది.

మహిళలు లక్ష్మీపూజలు చేసినప్పుడు కానీ ఇతర పూజలు కోసం తలస్నానం చేసిన తర్వాత కానీ తలపై జుట్టును కంట్రోల్ చేసేందుకు సైడ్ పిన్నులు వాడుతుంటారు. ఇలాంటి పిన్నులన్నీ ఇనుముతో తయారు చేసినవే ఎక్కువగా ఉంటాయి. వీటిని తలపై పెట్టుకుని లక్ష్మీపూజలు చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. ఇనుములో జ్యేష్టా దేవి ఉంటుంది. అలాంటి పిన్నులు తలపై పెట్టుకుని పూజలు చేస్తే ఫలితాలు ఉండవని పెద్దలు చెబుతున్నారు. లక్ష్మీదేవి రావాలని పూజిస్తూ నెత్తిపైన దరిద్ర వస్తువుల్ని పెట్టుకోవడం వల్ల ఫలితం రాదు.


పూర్వం రోజుల్లో అంటే నానమ్మ, అమ్మమ్మల కాలానికి వెళ్తే వారు బంగారం లేదా వెండితో చేసి జడ పువ్వుల్ని మాత్రమే వాడే వారు. తలారా స్నానం చేసినప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ ఇవే పెట్టుకునేవారు . జడపిన్నులు వెండితో తయారు చేయించి మాత్రమే ఉపయోగించేవారు. బంగారంతో చేయించిన జడ బిళ్లలు, చామంతి బిళ్లలు ఇలాంటివి అలంకార వస్తువులుగా వాడేవారు. బంగారము, వెండి లక్ష్మీనివాసాలన్న సంగతి అందరికి తెలుసు. వీటిని వాడటం వల్ల నష్టాలు ఉండవు. ఉన్నంతలో తృప్తిగానే బతికేవారు. డబ్బేకాదు తృప్తి కూడా లక్ష్మీ స్వరూపమే. అలాంటి తృప్తి ఇవాళ కనిపించకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. రబ్బరు బ్యాండ్లు కూడా మంచిది కాదు. ఉన్నికి ఎప్పుడూ స్పర్శ దోషం ఉండదు. నూలుతో చేసిన జడ పువ్వుల్ని ఉపయోగించడం మంచిది. ఇలాంటి పద్దతులు పాటిస్తే లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా ఒక దారి దొరుకుతుందని పెద్దలు చెబుతున్నారు. మగవారు కూడా పర్సులను బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకోవడం మంచిది కాదని పెద్దలు సూచిస్తున్నారు.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×