E-Paper
Advertisement

Special Police Officers: సిటీ పోలీస్​‌ వ్యవస్థలో.. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకం..?

Special Police Officers: సిటీ పోలీస్​‌ వ్యవస్థలో.. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకం..?
Advertisement

Special Police Officers: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ సిటీ పోలీస్​ లోకి త్వరలోనే స్పెషల్ పోలీస్​ ఆఫీసర్లు రానున్నారు. రాష్ట్రానికి చెందిన మాజీ సైనికులు, మాజీ పారా మిలటరీ బలగాలు, రిటైర్డ్​ పోలీసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవటానికి అర్హులని సీఏఆర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అడ్రస్ ప్రూఫ్​ కోసం ఖచ్చితంగా ఆధార్, ఓటర్​ ఐడీ కార్డులతోపాటు డ్రైవింగ్ లైసెన్సులో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మాజీ సైనికుల వయసు 2026, జనవరి 31వ తేదీనాటికి 58ఏళ్లలోపు ఉండాలని చెప్పారు.

గౌరవ వేతనంగా 26వేలు..

పారా మిలటరీ, రిటైర్డ్ పోలీసులు పదవీ విరమణ పొందిన రెండేళ్లలోపు వీటికి అప్లై చేసుకోవచ్చన్నారు. ప్రతీ నెలా గౌరవ వేతనంగా 26వేలు ఉంటుందన్నారు. ప్రత్యేక సెలవులు ఉండవని, అత్యవసర పరిస్థితుల్లో వేతన రహిత సెలవులు మాత్రమే మంజూరవుతాయన్నారు. డిశ్చార్జ్​ బుక్​, డిశ్చార్జ్​ సర్టిఫికెట్​, రిటైర్మెంట్ ఆర్డర్​, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్బీఐ బ్యాంక్​ పాస్​ బుక్​, ఓటరు ఐడీ, కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

Also Read: Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వ్యాపారులకు లాభాలు

ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్..

మాజీ సైనికులు, పారా మిలటరీ అభ్యర్థులకు టెక్నికల్​ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ ఉంటే దరఖాస్తుకు జత చేయాలన్నారు. డ్రైవర్​ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు. లైట్​ మోటార్​ వెహికిల్/హెవీ మోటారు వెహికిల్ లైసెన్స్​ కలిగి ఉండాలని చెప్పారు. మూడు పాస్​ పోర్ట్​ సైజ్​ ఫోటోలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు పెట్లబుర్జులోని సీఏఆర్​ హెడ్​ క్వార్టర్స్​ లో ఉన్న ఎస్పీవో ఆఫీస్​‌లో దరఖాస్తు ఇవ్వాలన్నారు. దరఖాస్తులకు మార్చి 5వ తేదీ చివరి గడువు అని స్పష్టం చేశారు.

Advertisement

Also read: Naveen Krishna: పవిత్ర లోకేష్ గురించి నరేష్ కొడుకు చెప్పింది వింటే షాక్ అవుతారు!.. ఇంట్లో ఎలా ఉంటారంటే?

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×