E-Paper
Advertisement

9 ఏళ్ల హైదరాబాద్ మెట్రో.. వెయ్యి కోట్ల నష్టాలు! అసలు కారణం ఇదే!

9 ఏళ్ల హైదరాబాద్ మెట్రో.. వెయ్యి కోట్ల నష్టాలు! అసలు కారణం ఇదే!
Advertisement

Hyderabad Metro: పిపిపి మోడల్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అతి పెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ మన హైదరాబాద్ దే. హైదరాబాద్ మెట్రో  త్వరలోనే  9ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. వాణిజ్య పరంగా వచ్చే లాభాలపైనే ఆధార పడి హైదరాబాద్ మెట్రో పట్టాలకెక్కింది.అయితే ఆశించిన స్థాయిలో  ఫలితాలు లేవు. మెట్రో ఆరంభం నుంచే నష్టాలు పోగు చేసుకుంటోన్న దుస్థితి.అధిక వడ్డీ రేట్ల కారణంగా ఏటా 13 వందల కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తోంది ఎల్.అండ్.టి. కరోనా మహమ్మారి ఎంట్రీతో మెట్రో రైల్ పై భారం అమాంతం పెరిగింది.నష్టాలు బాగా పెరిగాయి.దీన్నిగాడిలోపెట్టాలంటే వడ్డీ రేట్లు తగ్గించడమొక్కటే మార్గం అంటున్నారు నిర్వాహకులు.

పాాతిక కోట్ల మేరకు నష్టాలు..

Advertisement

ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలానికే మెట్రో నష్టాలు 405 కోట్ల మార్క్ ను దాటేసింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇదే సమయానికి మెట్రో నష్టాలు 380కోట్లపైచిలుకు ఉండేవి. అంటే ఈ ఏడాది మరో పాతిక కోట్ల మేరకు నష్టాలు పెరిగాయన్నమాట.ఈ కాలంలో రుణాలపై వడ్డీలకే 522 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని ఎల్.అండ్.టి యాజమాన్యం చెబుతోంది. మెట్రో నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనకు ఆర్ధిక పరమైన సమస్యలు అడ్డంకిగా నిలుస్తున్నాయి.

కేంద్ర నిబంధనలు ప్రకారం..

Advertisement

కేంద్ర నిబంధనల ప్రకారం మెట్రో మొదటి దశను నిర్వహిస్తోన్న ఎల్.అండ్.టి  తో 15 వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందం కుదుర్చుకుని  ప్రభుత్వం రెండో దశను  ప్రారంభించాలని  పాలకులు భావించారు. ఎల్.అండ్. టి. ప్రస్తుతం బ్యాంకులకు 8.25 శాతం వడ్డీలు చెల్లిస్తోంది. దీన్ని 4 శాతానికి తగ్గిస్తే నష్టాలను నియంత్రించవచ్చునని ప్రభుత్వం అంచనావేసింది. అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన కుదరకపోవడంతో  మెట్రో స్వాధీన ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా తీసుకున్న అప్పులపై నెల నెలా రెండు కోట్ల 85లక్షల రూపాయల మొత్తాన్ని వడ్డీ కింద చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రజారవాణా మరింత సౌకర్యవంతంగా మారాలంటే మెట్రో రెండో దశ విస్తరణ తప్పని సరి. అది కార్యరూపం దాల్చాలంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చొరవ చూపాలి.

Also Read: ఫ్రెంచ్ విప్లవ గడ్డపై మళ్లీ అగ్గి.. ఇది నిరసనా? అంతర్జాతీయ కుట్రా?

Tags

Related News

తెలంగాణ విద్యారంగంలో అతిపెద్ద స్కామ్.. టెన్త్ కూడా పాస్ అవ్వకుండానే జూనియర్ లెక్చరర్లా?

సిద్దిపేట ప్రజలకు హరీశ్ రావు బిగ్ అప్‌డేట్.. త్వరలోనే మరో భారీ ప్రాజెక్ట్!

కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సందడి.. డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం

మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. రైఫిల్, బుల్లెట్లతో ముగ్గురు అరెస్ట్!

తెల్లవారుజామున కారు బీభత్సం.. పైపులైన్ పగిలి గాల్లోకి ఎగిసిన నీరు, ఉప్పల్‌లో ఘటన

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు!

భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×