E-Paper
Advertisement

ఫ్రెంచ్ విప్లవ గడ్డపై మళ్లీ అగ్గి.. ఇది నిరసనా? అంతర్జాతీయ కుట్రా?

ఫ్రెంచ్ విప్లవ గడ్డపై మళ్లీ అగ్గి.. ఇది నిరసనా? అంతర్జాతీయ కుట్రా?
Advertisement

France Riots: ప్రపంచంలో అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన చరిత్ర ఫ్రెంచ్ విప్లవానిది. 1789 నుంచి 1799 వరకు జరిగిన ఈ విప్లవం తర్వాతే అనేక దేశాల్లో రాచరిక పాలనకు ముగింపు మొదలైంది. ఫ్రెంచ్ విప్లవంతో ఫ్రాన్స్‌లో భూస్వామవ్యవస్థ రద్దయింది. చరిత్రలో తొలిసారిగా మానవహక్కులు ప్రకటించబడ్డాయి. స్వేచ్ఛ, సమానత్వం అనే పదాలు పురుడు పోసుకున్నాయి. ఆ విప్లవం స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.

జరుగుతున్న హింసపై తీవ్ర విమర్శలు

Advertisement

ఫ్రాన్స్‌లో 1936, 1968, 1986, 2006లోనూ తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరిగాయి. పెయిడ్ హాలిడేస్, జీతాల పెంపు, ఉద్యోగాలు లాంటి అంశాలపై అక్కడి జనం ఎప్పటికప్పుడు ప్రభుత్వాలపై తిరగబడి తమ హక్కులు సాధించుకున్నారు. అయితే ప్రస్తుత ఆందోళనల్లో జరుగుతున్న హింసపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యమం ముసుగులో జరుగుతున్న అల్లర్లు దేశాన్నే అతలాకుతలం చేస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా ఇంత హింస చెలరేగడం వెనుక ఏదైనా భారీ కుట్ర దాగి ఉందా? అన్న ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది.

వెలుగులోకి సంచలన నివేదిక..

Advertisement

ఫ్రాన్స్ నిరసనలపై తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంచలన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫ్రాన్స్ అల్లర్ల వెనుక ఒక అదృశ్య అంతర్జాతీయ నెట్‌వర్క్‌ ఉందంటూ ఈ రిపోర్ట్  బట్టబయలు చేసింది. ఏకంగా 54 సంస్థలు, వాటికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న గ్లోబల్ నెట్‌వర్క్ ప్రమేయం ఇందులో ఉందని ఆ నివేదిక బల్లగుద్ది చెబుతోంది. ఈ నివేదికతో ఫ్రాన్స్ హింసాకాండ వెనుక ఉన్న తెరవెనుక రాజకీయాలు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.ఫ్రాన్స్‌ను దహించివేస్తున్న ఈ భారీ ఆందోళనల వెనుక వామపక్ష, కమ్యూనిస్టు, సోషలిస్టు సంస్థల హస్తం ఉందని ఈ రిపోర్ట్ చెప్తోంది. వివిధ దేశాలకు చెందిన విద్యార్థి సంఘాలు, కార్మిక పక్షపాతిగా చెప్పుకునే ట్రేడ్ యూనియన్లు, పాలస్తీనా అనుకూల మద్దతుదారులతో పాటు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం ఈ ఆందోళనల్లో భాగస్వాములయ్యాయని ఈ నివేదిక తేల్చింది. అయితే ఆయా సంస్థలు నేరుగా హింసను ప్రేరేపించాయా లేక కేవలం శాంతియుత నిరసనల్లో మాత్రమే పాల్గొన్నాయా అనే కోణంలో కచ్చితమైన స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ

Tags

Related News

రష్యా డేటా సెంటర్లపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిపోయిన డిజిటల్ సేవలు!

జైలు నుంచి పారిపోయి తన కవల సోదరుడి గుర్తింపుతో జీవనం.. యువతి సాయంతో పట్టుకున్న పోలీసులు

యెమెన్‌లో హూతీల క్షిపణి విధ్వంసం.. 53 మంది మృతి!

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

Big Stories

Advertisement
×