E-Paper
Advertisement

HYDRA Demolish: మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా, అక్రమ నిర్మాణాలు కూల్చివేత

HYDRA Demolish: మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా, అక్రమ నిర్మాణాలు కూల్చివేత
Advertisement

HYDRA Demolish: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపింది హైడ్రా. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలిసిన అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో అక్రమ నిర్మాణంపై కొరడా ఝులిపించింది.

సర్వే నంబర్‌ 848 రోడ్డును ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేసింది. రెండు వారాల కిందట నోటీసులు ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో భారీ యంత్రాలతో వాటిని కూల్చివేసింది.

Advertisement

అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు చోట్ల ఈ అక్రమ నిర్మాణాలను గుర్తించింది హైడ్రా. ఇటీవల నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లు కూల్చివేసిన విషయం తెల్సిందే.

న్యాయస్థానం మార్గ దర్శకాల ప్రకారం ముందుగా నోటీసులు ఇస్తోంది. అందుకు 15 రోజులు గడువు ఇస్తోంది. రెండు వారాల్లో నిర్మాణాలను యజమానులే ఆక్రమణలు తొలగించకపోతే రంగంలోకి దిగుతోంది హైడ్రా.

Advertisement

ALSO READ:  హ‌రీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశాడు..కాంగ్రెస్ నేత సంచల‌న వ్యాఖ్య‌లు

మరోవైపు వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. రోడ్ నంబర్-5లో 150 ఫీట్ల పొడవైన రోడ్డును 4 ఫీట్ల వరకు కబ్జా చేశారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వెళ్లాయి.

స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకురావడంతో జీహెచ్ఎంసీ అధికారులు కదిలారు. అయితే పైపై మెరుగులు దిద్దినట్లుగా కూల్చి వెళ్లిపోయారన్నది కాలనీ వాసులు ఆరోపణ. రోడ్డుపై కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చాలన్నది కాలనీ వాసుల డిమాండ్.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×