Pushpa 2 Tickets : ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప గాడి రూల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం “పుష్ప 2 ” (Pushpa 2) ఫీవర్ తో ఊగిపోతోంది. తాజాగా రిలీజైన ‘పుష్ప 2″ ట్రైలర్ గురించే నెట్టింట చర్చ నడుస్తుంది. అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన “పుష్ప 2” (Pushpa 2) ట్రైలర్ బీహార్, పాట్నాలోని గాంధీ గ్రౌండ్ లో ఆదివారం రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకెళ్తోంది. మొత్తానికి మేకర్స్ ట్రైలర్ తో ఈ మూవీ ప్రమోషన్లలో జోరు పెంచారు. అయితే తాజాగా ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.
“పుష్ప 2” (Pushpa 2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించి స్పెషల్ ప్రమోషనల్ ప్లాన్లను రెడీ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే మైత్రి మూవీ మేకర్స్ ఒక వినూత్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేంటంటే… ప్రతి థియేటర్ లోనూ “పుష్ప 2” టికెట్లను తొలి రోజు, తొలి టికెట్ వేలం పద్ధతి ద్వారా అమ్మాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్లదే ఫస్ట్ టికెట్ అన్నమాట. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని దాదాపు అన్ని థియేటర్లలో కూడా మొదటి టికెట్ ఆక్షన్ అనే ఈ పద్ధతి ద్వారానే టికెట్లను విక్రయించబోతున్నారని తెలుస్తోంది. ఆ సమాచారం మొత్తాన్ని ఆన్లైన్లో కూడా పొందుపరచబోతున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఇది కేవలం ప్రతిపాదనలో ఉన్న ఆలోచన మాత్రమే అని తెలుస్తుంది. కానీ ఇప్పటికే “పుష్ప 2” మూవీకి భారీ హైప్ ఉండడంతో, దీన్ని బట్టి చూస్తే వేలం ఐడియా కూడా సూపర్ హిట్ ప్రమోషనల్ స్టంట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఒకవేళ ఈ ప్లాన్ గనక సక్సెస్ అయితే “పుష్ప 2” (Pushpa 2) మూవీ వసూళ్లు మొదటి రోజే భారీగా ఉండబోతున్నాయి. ఇప్పటికే “పుష్ప 2 : ది రూల్” మూవీ సృష్టించబోయే రికార్డులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. టాలీవుడ్ లో చాలామంది ఈ మూవీ 1000 కోట్ల సినిమా అవుతుందని కామెంట్స్ చేస్తుంటే, అల్లు అర్జున్ అభిమానులు మాత్రం 2000 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే “పుష్ప 2” రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. “పుష్ప” పార్ట్ వన్ 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కానీ సీక్వెల్ పై ఊహించనంత హైప్ ఉంది. ఇక మేకర్స్ ప్లాన్ చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే ‘పుష్ప 2’ కలెక్షన్లు 1000 ఈజీగా రాబడుతుందని అన్పిస్తోంది. మరి బాక్స్ ఆఫీసు దగ్గర పుష్ప గాడి రూల్ ఎలా ఉంటుందో చూడాలంటే డిసెంబర్ 5 దాకా ఆగాల్సిందే. ఇప్పటికైతే చాలామంది “పుష్ప 2” టికెట్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు.