E-Paper
Advertisement

తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్.. డే అండ్ నైట్ వానలే వానలు

తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్.. డే అండ్ నైట్ వానలే వానలు
Advertisement

Telangana Weather: దేశంలోని నైరుతి రుతుపవనాలు ప్రభావం కనిపిస్తోంది. గురువారం రాత్రి నుంచి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడింది. శనివారం అనగా జూన్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి అంచనా వేసింది.

తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్

Advertisement

తెలంగాణకు చల్లని కబురు చెప్పింది వాతావరణ కేంద్రం. వారం రోజుల్లోపు వర్షాలు పడతాని ముందుగా అంచనా వేసింది. అయితే రుతుపవనాలు వేగం పెరగడంతో శనివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ ఐఎమ్‌డి అంచనా వేసింది.

రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. వర్షాల నేపథ్యంలో 36 డిగ్రీలకు తక్కువగా ఉండవచ్చని భావిస్తోంది.

Advertisement

శనివారం నుంచి డే అండ్ నైట్ వానలే వానలు

రానున్న రెండు రోజులు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంగా వీస్తాయని తెలిపింది.

యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తానికి శనివారం నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. ఈ విషయం తెలియగానే రైతుల్లో ఆనందం మొదలైంది.

ALSO READ: రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో? 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×