E-Paper
Advertisement

Telangana: అమరజ్యోతి.. త్యాగాల ప్రతిదీప్తి.. ఇక అమరం.. అజరామరం..

Telangana: అమరజ్యోతి.. త్యాగాల ప్రతిదీప్తి.. ఇక అమరం.. అజరామరం..
Advertisement

Telangana: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం.. అమరజ్యోతిని ఆరంభించారు సీఎం కేసీఆర్. స్మారక లోపల నివాళులు అర్పించారు. అమర వీరులకు నివాళిగా.. పోలీసులు 12 తుపాకులతో గన్‌ సెల్యూట్ చేశారు.

అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా.. 10 వేల మందితో కొవ్వొత్తుల ప్రదర్శనతో అమరులకు నివాళులు అర్పించారు. పలువురు అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ సన్మానించారు.

Advertisement

అమరుల స్మారకం ముందు నిర్వహించిన సభలో.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు సీఎం కేసీఆర్. రక్తం బొట్టు చిందకుండా.. ప్రణాళికాబద్ధంగా కొట్లాడామని చెప్పారు. ఎన్ని విమర్శలు, ఛీత్కారాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని.. ప్రత్యేక రాష్ట్రం సాకారం చేసుకున్నామని చెప్పారు.

అమరుల స్మారక చిహ్నాని అమరజ్యోతిగా నామకరణం చేశారు ముఖ్యమంత్రి. ఇకపై తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఏ దేశ, విదేశీ ప్రతినిధులైనా.. ముందుగా అమరజ్యోతి దగ్గర అంజలి ఘటించాకే వారి అధికార పర్యటన కొనసాగుతుందని ప్రకటించారు సీఎం కేసీఆర్.

Advertisement

కేసీఆర్ ప్రసంగం అనంతరం.. ఆకాశంలో అద్భుతమైన డ్రోన్ ప్రదర్శన ఇచ్చారు. 800 డ్రోన్లు.. నింగిలో రకరకాల రంగులీనుతూ.. తెలంగాణ వైభవాన్ని చాటాయి. డ్రోన్ లైటింగ్‌తో కాకతీయుల తోరణం, చార్మినార్, బతుకమ్మ, తెలంగాణ ఉద్యమ పిడికిలి, కేసీఆర్ నాయకత్వం, అమరుల స్థూపం, శాంతికపోతం, అసెంబ్లీ భవనం, టీహబ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నమూనాలను లేజర్ షోతో ప్రదర్శించారు. చివర్లో జోహార్ తెలంగాణ అమరవీరులకు.. నినాదంతో అమరజ్యోతి ప్రతిరూపాన్ని ఆకాశంలో ఘనంగా చాటింది డ్రోన్ లేజర్ షో.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×