BigTV English

Corona Alert: రాహుల్ టార్గెట్ గానే కరోనా అలర్ట్?.. కావాలనే కొత్త వేరియంట్ పై కలకలం?

Corona Alert: రాహుల్ టార్గెట్ గానే కరోనా అలర్ట్?.. కావాలనే కొత్త వేరియంట్ పై కలకలం?

Corona Alert: ఇవాళ దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసులు ఎన్ని? ఈ ప్రశ్న అడగ్గానే వెంటనే సమాధానం చెప్పలేరు. గూగుల్ లో సెర్చ్ చేస్తే.. 100 పైచిలుకు కేసులు మాత్రమే చూపిస్తుంది. అసలు, కరోనా గురించి, కేసుల గురించి జనాలు ఎప్పుడో మర్చిపోయారు. మాస్కులు మూలనపడేశారు. శానిటైజర్ల జాడే లేదు. అంతెందుకు, ఇటీవల కాలంలో మీ చుట్టుపక్కల ఫలానా వారికి కరోనా వచ్చిందనే వార్త విన్నారా? లేదే. లేటెస్ట్ కరోనా వేరియంట్ ఏంటో తెలుసా? తెలీదు. ఇలా దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ.. ఎలాంటి కొవిడ్ డేంజర్ బెల్స్ మోగకపోయినా.. సడెన్ గా కేంద్ర ఆరోగ్యశాఖ.. కరోనాపై అలర్ట్ చేస్తూ రాష్ట్రాలకు లేఖలు రాయడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఇదేంటి.. ఇప్పుడు కరోనా అలర్ట్ ఏంటి? అంటూ భయపడ్డారు. ఎంతగా లాజిక్ లాగినా కూడా.. కేంద్రం రంగంలోకి దిగాల్సినంత అత్యవసర పరిస్థితి మాత్రం ప్రస్తుతం లేదనే చర్చ నడుస్తోంది. మరి, కేంద్ర ప్రభుత్వం ఎందుకలా రాష్ట్రాలకు లేఖ రాసింది?


కట్ చేస్తే, కరోనా అలర్ట్ మోగించిన కొన్నిగంటల్లోనే అదే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నుంచి రాహుల్ గాంధీకి లేఖ రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని.. లేదంటే యాత్రను నిలిపివేయాలనేది ఆ లేఖ సారాంశం.

ఇటు కరోనా అలర్ట్ అంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేయడం.. ఆ వెంటనే రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రను టార్గెట్ చేయడం చూస్తుంటే.. దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉందనే అనుమానం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ భారీ ర్యాలీలు నిర్వహించలేదా? గతంలో కేసులున్నా కూడా కుంభమేళాలు జరపలేదా? స్కూళ్లు, గుళ్లు, సభలు, సమావేశాలకు లేని అభ్యంతరం రాహుల్ గాంధీ యాత్రకే వచ్చిందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే.. సడెన్ గా ఇలా కరోనా సాకుతో యాత్రకు బ్రేకులు వేయాలని చూస్తున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ.


రాహుల్ యాత్ర కీలకమైన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో జరుగుతుండటంతో.. బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా కొవిడ్ కొర్రీలు పెడుతోందని హస్తం నేతలు అనుమానిస్తున్నారు. చైనాలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి.. అయినా, చైనాకు విమానాలు నడుపుతున్నారు. ముందు విదేశాలకు ఫ్లైట్ సర్వీసులు ఆపకుండా.. యాత్రను ఆపాలంటూ లేఖలు రాయడం రాజకీయ కుట్రలో భాగమేనంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

కాంగ్రెస్ నుంచి ఈ స్థాయిలో కౌంటర్లు రావడంతో.. వెంటనే మరో బ్రేకింగ్ న్యూస్ రిలీజైంది. భారత్ లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగు చూసిందని.. ఇప్పటి వరకు 3 కేసులు నమోదయ్యాయని తెలిపింది. నిజమే. కొత్త వేరియంట్ వచ్చింది. మొదటి కేసు గత అక్టోబరులోనే వెలుగు చూసింది. గడిచిన మూడు నెలల్లో 3 కేసులు వచ్చాయి. అక్టోబరులోనే కొత్త వేరియంట్ ఎంట్రీ ఇవ్వగా.. కావాలనే ఇప్పుడు ఈ విషయంలో హైఅలర్ట్ క్రియేట్ చేశారని అంటున్నారు. గుజరాత్, ఒడిశాలో బీఎఫ్.7 వెలుగు చూడగా.. రాహుల్ గాంధీ పాదయాత్ర ఆయా రాష్ట్రంలో ఎప్పుడో ముగిసింది. ప్రస్తుతం ఆయన హర్యానాలోకి ఎంటర్ అయ్యారు. అయినా, యాత్రకు అభ్యంతరం చెప్పడం చూస్తుంటే.. ఇదంతా పక్కా టార్గెటెడ్ గా జరుగుతోందనేది కాంగ్రెస్ వర్గాల అనుమానం.

Related News

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Big Stories

×